దేశవ్యాప్తంగా 756 ప్రధాన స్టేషన్లలో వీడియో నిఘా వ్యవస్థ

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న పిఎస్‌యు సంస్థ అయిన రైల్‌టెల్‌ ఆధ్వర్యంలో వివిధ రైల్వే స్టేషన్లలో నిర్భయ నిధుల కింద వీడియో నిఘా వ్యవస్థ (విఎస్‌ఎస్‌) ప్రాజెక్టును (సిసిటివి కెమరాల నెట్‌వర్క్‌) చేపట్టేందుకు ఏజెన్సీలు ఖరారు చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో దేశవ్యాప్తంగా ఏ1, ఏ, బి, సి కేటగిరీలకు చెందిన 756 ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. 
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 76 రైల్వే స్టేషన్లు ఉండగా, ఈ ప్రాజెక్టు 2023 జనవరి నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. మిగిలిన స్టేషన్లలో రెండో దశలో అమలుచేస్తారు. భారతీయ రైల్వే ప్రధాన అంశాలలో భద్రత, సురక్షితం ముఖ్యమైనది. రాకపోకలు అధికంగా ఉండే రైల్వే స్టేషన్లలో భద్రతను మెరుగుపరచ్చాలనే ఉద్దేశ్యంతో భారతీయ రైల్వే ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (ఏపి) ఆధారిత వీడియో నిఘా వ్యవస్థను (విఎస్‌ఎస్‌) రైల్వే స్టేషన్లలో అమలు చేసే ప్రక్రియను చేపట్టింది.
ఆ స్టేషన్లలోని విశ్రాంతి గదులు, రిజర్వేషన్‌ కౌంటర్లు, పార్కింగ్‌ స్థలాలలో, ప్రధాన ప్రవేశ మార్గం/వెళ్లే మార్గాలలో, ప్లాట్‌ఫారాలపై, పాదచారుల వంతెనలపై, బుకింగ్‌ కార్యాలయాలు మొదలగు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తారు. నిర్భయ నిధుల కింద భారతీయ రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో వీడియో నిఘా వ్యవస్థను పనులను చేపట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ రైల్వేలో రోలింగ్‌ స్టాక్‌, నిర్మాణ పనులు, భద్రత, సైబర్‌ భద్రత లేదా పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా వేగవంతంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ విఎస్‌ఎస్‌ వ్యవస్థ ఐపి ఆధారితంగా ఉంటుంది.  సీసీటీవీ కెమరాలకు నెట్‌వర్క్‌ కలిగుంటాయి.
ఈ సీసీటీఈలు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబల్‌ నెట్‌వర్క్‌తో ఉంటాయి.  సీసీటీవీ కెమరాల్లోని అంశాలను స్థానిక ఆర్‌పిఎఫ్‌ పోస్టులలోనే కాకుండా డివిజినల్‌, జోనల్‌ స్థాయిలలో కేంద్రీకృత సీసీటీవీ కంట్రోల్‌ రూములలో కూడా చూడవచ్చు. స్టేషన్లలోని సీసీటీవి కెమరాల్లోని వీడియో ఫీడ్లను రెల్వే పరిసరాలలోని 3 స్థాయిల్లో పర్యవేక్షిస్తూ భద్రతను మెరుగుపర్చవచ్చు.
ఈ వ్యవస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌ (ఏఐ)తో ప్రారంభించిన వీడియోను విశ్లేషించే సాఫ్టవేర్‌తో ఉంటుంది.  ముఖ చిత్రాలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ అపరిచిత నేరస్తులు స్టేషన్‌ ప్రాంగణంలో ప్రవేశించినప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు తోడ్పడుతుంది. కెమరాలు, సర్వర్‌, యూపిఎస్‌, స్విచుల పర్యవేక్షణ కోసం నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఎన్‌ఎమ్‌ఎస్‌) ఏర్పాటు చేస్తారు. వీటిని అధీకృత సిబ్బంది ద్వారా ఏదైనా బ్రౌజర్‌ నుండి కూడా వీక్షించవచ్చు.
 
రైల్వే పరిసరాలను పూర్తిస్థాయిలో కవర్‌ చేసేందుకు 4 రకాల (డోమ్‌ టైప్‌, బులెట్‌ టైప్స్‌, పాన్‌ టిల్ట్‌ జూమ్‌ టైప్‌, ఆల్ట్రా హెచ్‌డి`4కె) ఐపి కెమరాలు ఏర్పాటు చేస్తారు. ఇవి భద్రతను మెరుగు పర్చడంలో ఆర్‌పిఎఫ్‌ అధికారులకు అదనపు సౌకర్యంగా ఉంటాయి. సిసిటీవి కెమరాల్లో రికార్డు అయిన వీడియోలు 30 రోజుల వరకు స్టోర్‌ చేబడతారు. 
 
ఈ వ్యవస్థలోని భద్రతా ముఖ్యాంశాలు
ఆర్‌డిఎస్‌ఓ వర్షన్‌ 6.0 ద్వారా వీడియోను విశ్వేషించడం, ముఖ చిత్రాలను గుర్తించడం వంటి కొన్ని సాఫ్ట్‌వేర్‌ తోడ్పాటుతో ఏవేని సంఘటలు జరిగినప్పుడు సంసిద్ధంగా ఉండి ఎదుర్కొనవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌ (ఏఐ) అందజేసే విశ్టేషణ సాప్ట్‌వేర్‌ నిర్వహణతో నిర్ధిష్ట అలారంతో మరియు పిఓపి యూపి దిగువ అంశాలను వీక్షించవచ్చు : 
ఏ. చొరబాట్లను గుర్తించడం (వ్యక్తులు రైల్వే కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలలోకి ప్రవేశించినప్పుడు)
బి. కెమరా ట్యాంపరింగ్‌
సి. అనుమానితులను గుర్తించడం
డి. వ్యక్తులను మరియు వాహనాలను గుర్తించడం
ఇ. ప్రవర్తన ద్వారా వ్యక్తులను గుర్తించడం 
ఎఫ్‌. రంగులను గుర్తించడం
జి. పడిపోయిన వ్యక్తులను గుర్తించడం
హెచ్‌. సమూహాన్ని గుర్తించడం (వ్యక్తులను/వాహనాలను)
 
ఎఫ్‌ఆర్‌ఎస్‌ : వీఎస్‌ఎస్‌ (సిసిటివి) వ్యవస్థలోని వీడియోలో ముఖ చిత్రాలు రికార్డు అవుతాయి.  బ్లాక్‌లిస్ట్‌లో అవి ఉంటే అప్రమత్తతో హెచ్చరికను తెలియజేస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హెచ్చరికలను వీడియో మేనేజ్‌మెంట్‌ సిస్టం/ఎన్‌విఆర్‌ (వీడియో మేనేజ్‌మెంట్‌ సిస్టం/ఎన్‌విఆర్‌తో నిరాటంకంగా అనుసంధానం కలిగుంటుంది)కు అందజేస్తుంది. 
 
విఎమ్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రతిపాదిత ఐపి కెమరాలలో అలారం ఇన్‌పుట్‌, ఔట్‌పుట్‌ కార్యకలాపాల పర్యవేక్షణకు తోడ్పడుతుంది. విఎమ్‌ఎస్‌ మొబైల్‌ ఫోన్‌ క్లయింట్ల ఫీచర్‌ కలిగుంటుంది, దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితులలో, అధికారిక వినియోగదారులు నమోదైన పోన్ల ద్వారా స్థానిక విఎమ్‌ఎస్‌ సర్వర్‌కు వీడియోలను, స్నాప్‌షాట్లను అప్‌లోడ్‌ చేయవచ్చు. 
 
కేంద్రీకృత ప్రాంతాలలోని ఆపరేటర్లు అవసరమైతే ఈ హెచ్చరిక సందేశాలను, ప్లే బ్యాక్‌ వీడియోలను స్టేషన్ల నుండి వీక్షించవచ్చు. కేంద్రీకృత ప్రాంతాలలోని ఆపరేటర్‌ సంబంధిత ఆర్‌పిఎఫ్‌/ థానా వారికి మరియు సంబంధిత భద్రతా అధికారి నమోదిత ఫోన్‌ నెంబరుకు హెచ్చరికలను పంపిస్తారు. 
 
ప్యానిక్‌ బటన్‌ : ప్రతి ప్లాట్‌ఫారం వద్ద రెండు ప్యానిక్‌ బటన్‌లను ఏర్పాటు చేస్తారు. అవసరమైన వారు ఎవరైనా పానిక్‌ బటన్‌ను నొక్కితే స్టేషన్‌లోని ఆపరేటర్‌ కెమరాలోని పిఒపి`యూపిలో అలారమ్‌ కనిపిస్తుంది. ఒకవేళ ఆ కెమరా పిటిజెడ్‌ రకానిది అయితే ఆపదలో ఉన్న వ్యక్తిని చూడడానికి పానిక్‌ బటన్‌పై కెమరాని జూమ్‌ చేయాలి.
 
 స్టేషన్లలోని సిసిటివి కెమరాలలో రికార్డు అయిన వీడియోలను వీక్షించేందుకు, అవసరమైన సంఘటలను విశ్లేషించేందుకు, దర్యాప్తు చేసేందుకు అనుకూలంగా దగ్గరలోని ఆర్‌పిఎఫ్‌ థానా/పోస్టులలో 30 రోజుల వరకు స్టోర్‌ చేస్తారు. 
 
ముఖ్యమైన వీడియోలు డేటా సెంటర్లలో (240 టిబి స్టోరేజ్‌ వినియోగంతో) ఆర్‌పిఎఫ్‌ తానా / పోస్టులలో అదనంగా 10 శాతం స్టోరేజీ విధానంతో (రైల్వే అవసరాల మేరుకు) దీర్ఘకాలంగా స్టోర్‌ చేస్తారు. 
 
సమర్థవంతమైన కార్యకలాపాలకు, ఐటి నిర్వహణ పర్యవేక్షణ కోసం వీఎస్‌ఎస్‌లో పరికరాలు (కెమరాలు, స్విచ్‌లు, సర్వర్‌/వర్క్‌స్టేషన్‌, స్టోరేజీ, పిసి వర్క్‌స్టేషన్లు, యూపిఎస్‌ మొదలైనవి) ఏర్పాటు చేస్తారు. ఈఎమ్‌ఎస్‌లో కీలకమైన కొన్ని అంశాలు దిగువ విధంగా ఉన్నాయి :
ఎ. కేంద్రీకృత మరియు ఇంటిగ్రేటెడ్‌ డాష్‌బోర్డు వీక్షణ
బి. కేంద్రీకృత మరియు అనుకూలంగా ఉండే సర్వీసు స్థాయి రిపోర్టింగ్‌
సి. సర్వర్‌/వర్క్‌స్టేషన్‌ మార్పు, ప్రొవిజినింగ్‌ కన్ఫిగురేషన్‌
డి. నెట్‌వర్క్‌ ఆటోమేషన్‌ 
ఇ. సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ (హెల్ప్‌డెస్క్‌) ఎస్స్ఎల్‌ఏ మేనేజ్‌మెంట్‌
ఎఫ్‌. కేంద్రీకృత ఐటి అసెట్‌ ఇన్వెంటరీ డిస్కవరీ  ట్రాకింగ్‌
జి. సర్వర్‌ / వర్క్‌షాప్‌ పర్యవేక్షణ
హెచ్‌. నెట్‌వర్క్‌ లోపాలు కార్యకలాపాల నిర్వహణ
ఐ. పెనాల్టీ పర్యవేక్షణ, నిర్వహణ