టీఆర్ఎస్ వైఫల్యాలపై సంజయ్ ఆర్టీఐ అస్త్రం

ఎనిమిదేళ్లుగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా బిజెపి తెలంగాణ శాఖ ఆర్‌టిఐను ఆయుధంగా వాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో శాసనసభ, శాసనమండలి, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు, 2014, 2018 టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ, రెవెన్యూ, ఎసిబి, సంక్షేమ, పంచాయతీరాజ్‌, సాగునీటి, విద్యా, వైద్య శాఖలకు దాదాపు వంద ధరఖాస్తులను ఆర్‌టిఐ ద్వారా దాఖలు చేశారు.
 
 ఈ ధరఖాస్తులను దాఖలు చేయడంలో ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, టిఆర్‌ఎస్‌ పార్టీని ఆధారాలతో సహా, పకడ్భందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ధరఖాస్తులను ఆర్‌టిఐ ద్వారా దాఖలు చేయాలని, పార్టీకి అనుబంధంగా వున్న యువమోర్చాలు, పార్టీ రాష్ట్ర నాయకులు వివిధ అంశాలపై ఆర్‌టిఐ ద్వారా ధరఖాస్తులు చేసి ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. 
 
ఇప్పటికే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి వందలకోట్లు ఖర్చుచేసి దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలపై ధరఖాస్తు చేశారు. సంజయ్‌ ఆర్‌టిఐ ద్వారా దాదాపు వందలాది ధరఖాస్తులను గత నెల 28వ తేదీన ఆర్‌టిఐ ద్వారా సమాచారం కోరుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ధరఖాస్తులు దాఖలు చేశారు.
ఆర్‌టిఐ ద్వారా సంజయ్‌ కోరిన సమాచారం వివరాలు:
 
* 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా, వివిధ సమావేశాల్లో, సభల్లో ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీల వివరాలు ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? ఎన్ని పెండిరగ్‌లో వున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
 
* కేసీఆర్ శాసనసభ, శాసనమండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు వివరాలను ఇప్పింగలరు. 
* శాసనసభ, శాసనమండలిలో కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు అయ్యాయి? ఎన్ని పెండిరగ్‌లో ఉన్నాయి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
 
2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 కేసీఆర్ ఎన్నిసార్లు ఇప్పటివరకు రాష్ట్ర సచివాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించారో పూర్తి సమచారాన్ని ఇప్పించగలరు.
 
* కేసీఆర్  2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎన్నిరోజులు హైదరాబాదులోని అధికార నివాసంలో బస చేశారు?, ఎన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
 
* కేసీఆర్ ఆధికారిక నివాసం ప్రగతిభవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఎంతఖర్చు చేసింది? వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు?
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసింది? ఈ నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీల భర్తీకోసం విడుదల చేశారు? వీటికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు?
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు ఎన్ని ఉద్యోగఖాళీలు భర్తీచేసింది? ఎంత మందికి కొత్త వారు ఉద్యోగాల్లో చేరారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు?
 
* 2 జూన్‌ 2014 నుండి 30 మే 2022 వరకు ఎంత మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు?
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రప్రభుత్వం ఎన్ని ఉపాధ్యాయపోస్టులను ఇప్పటివరకు భర్తీచేసింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పించగలరు.
 
* ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు కేసీఆర్  ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు? ఆ పర్యటనలకు ఎంత ఖర్చు అయింది? వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు కేసీఆర్ చేసిన పర్యటనలకు ప్రైవేట్‌ విమానాలను వినియోగించారా? లేక రెగ్యులర్‌ విమానాల్లోనే ప్రయాణించారా?వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 
 
* కేసీఆర్  2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు వివిధ రాష్ట్రాలో పర్యటించినప్పుడు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉన్నారా? లేక ప్రైవేట్‌ హోటళ్లల్లో బస చేశారా? వీటికి సంబంధించి పూర్తి సమాచారన్ని ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 నుండి 30 మే 2022 వరకు కేసీఆర్  ఇప్పటివరకు తీసుకున్న జీతభత్యాలు ఎంత? దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 లో తెలంగాణలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత సాగునీరు అందిందో నియోజకవర్గాల వారీగా ఇప్పించగలరు.
*  2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని ఇప్పించగలరు.
 
* ఎస్సీ, ఎస్టీ పేదలకు 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎంత మందికి భూపంపిణి చేశారు? ఒక్కొక్కరికి ఎంత భూమి ఇచ్చారు? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 
 
* 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎస్సీ, ఎస్టీ పేదలకు భూపంపిణీకి ఎన్ని నిధులు కేటాయించారు. అందులో ఎన్ని నిధులు దీనికోసం ఖర్చు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎస్సీ, ఎస్టీ, సామాజికవర్గాల వారు భూమి కోసం ఎంత మంది ధరఖాస్తు చేశారు? అందులో ఎంతమంది అర్హులు ఉన్నారు? వీరిలో ఎంతమందికి భూమి కేటాయించారు? ఇంకా ఎన్ని ధరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి?
 
* 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రభుత్వం నిర్మించింది. దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 
* 10 డిసెంబర్‌ 2018 నాటికి లక్ష రూపాయలు రుణమాఫీ పొందడానికి ఎంతమంది రైతులకు అర్హత ఉంది. అందులో ఎంత మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేశారు? దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు.
* 2 జూన్‌ 2014 నుండి 2022 వరకు బీసీలకు కేటాయించిన నిధులు ఎన్ని? అందులో చేసిన ఖర్చు ఎంత? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని సంవత్సరాల వారిగా ఇప్పించగలరు. 
*  తెలంగాణ రాష్ట్రంలో ఎం.బి.సి. కార్పోరేషన్‌కు 2014 నుండి 2022 వరకు కేటాయించిన నిధులు ఎంత? అందులో ఖర్చుచేసింది ఎంత? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని సంవత్సరాల వారీగా ఇప్పించగలరు.
* 2 జూన్‌ 2014 నుండి 30 మే 2022 వరకు ప్రభుత్వం చేసిన అప్పులెంత? ఈ అప్పులకు నెలకు వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు? ఈ అప్పులు ఏఏ ఆర్థిక సంస్థలనుండి తీసుకున్నారు? వీటికి సంబంధించి పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు?
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది సలహాదారులను నియమించింది? వారికి ఇస్తున్న జీతభత్యాలు ఎంత? దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పించగలరు?
 
* రాష్ట్రప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు ఇప్పటివరకు ఎన్నిసలహాలు ఇచ్చారు? అందులో ఎన్ని పాటించారు? వారు ఎవరికి సలహాలిస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తివివరాలను ఇప్పించగలరు?
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను ఎన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు.
 
* 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మండలాల్లో 30 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని మండలాల వారీగా ఇప్పించగలరు.
* రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.కె. సిన్హా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారా? సమర్పిస్తే ఎప్పుడు సమర్పించారు? ఆ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు.
* కేంద్ర ప్రభుత్వం నుండి ఉచితంగా ఇస్తున్న రేషన్‌ బియ్యానికి పాలిష్‌కొట్టి బహిరంగ మార్కెట్‌లో కొంతమంది రైస్‌మిల్లర్లు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి ఏమైనా వచ్చిందా? వస్తే దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి?