సిగరెట్ తో కాళికా దేవి పోస్టర్ పై వివాదం

‘కాళి’ పేరుతో  విడుదలైన  ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌ పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా సోషల్ మీడియాపై  రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో కాళీమాత గెటప్ లో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో సిగిరెట్ తాగుతున్నట్లు ఉంది.
మరో చేతితో ఎల్జిబిటి జెండాను పట్టుకున్నట్లు పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారింది. తమిళనాడులో పుట్టి ప్రస్తుతం టొరంటో (కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై కాళి టైటిల్‌తో రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
పోస్టర్‌ అభ్యంతరకరంగా ఉందని, లీనా మణిమేకలై వెంటనే క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ కొందరు నెటిజన్లుహెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో ఆమె వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చగొట్టేలా ఓ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో లీనా మణిమేకలైపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం అరెస్ట్‌ లీనా మణిమేకలై హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతున్న నేపథ్యంలో ఆమె ఓ ట్వీట్ చేశారు. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్‌ అంటూ డిమాండ్‌ చేసిన వాళ్లంతా లవ్‌యూ అంటారంటూ ట్వీట్‌లో లీనా మణిమేకలై పేర్కొంది. అయినా ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారటం లేదు.