జూన్‌ జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లు

జీఎ్‌సటీ వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. జూన్‌ నెల వసూళ్లు రూ.1,44,616 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 56 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధిక మొత్తం.

ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత పన్ను వసూళ్లలో జీఎ్‌సటీ సత్తా ఏంటో తెలుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ లెక్కన ఇక నెలకు రూ.1.4 లక్షల కోట్లకు తగ్గకుండా జీఎ్‌సటీ వసూళ్లు పెద్ద కష్టం కాకపోవచ్చని తెలిపారు. జీఎ్‌సటీ ప్రారంభమైన తర్వాత నెలవారీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లు మించడం ఇది ఐదోసారి.

జూన్‌ నెలలో జీఎ్‌సటీ కింద వసూలైన రూ.1.44 లక్షల కోట్లలో సీజీఎ్‌సటీ కింద రూ.23,306 కోట్లు, రూ.32,406 కోట్లు ఎస్‌జీఎ్‌సటీ కింద, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ కింద రూ.75,887 కోట్లు వసూలయ్యాయి. 

ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ కింద వసూలైన రూ.75,887 కోట్లలో రూ.40,102 కోట్లు దిగుమతి సుంకాల ద్వారా వసూలైంది. సెస్‌ ద్వారానూ జూన్‌ నెలలో రూ.11,018 కోట్ల జీఎ్‌సటీ వసూలైంది. మళ్లీ ఇందులో రూ.1,197 కోట్లు దిగుమతి వస్తువులపై విధించిన సెస్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది.