ప్రగతి మైదాన్‌లో చెత్తను చేతితో తీసివేసిన ప్రధాని

ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కింద కొత్తగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు ఆసక్తిగా పర్యవేక్షించారు. టన్నెల్ చుట్టూ కలియతిరుగుతూ టన్నల్‌ పేవ్‌మెంట్‌పై కనిపించిన చెత్త, ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను చేత్తో తీసివేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టన్నల్‌ గోడలపై చిత్రీకరించిన పెయింట్లను ప్రధాని ఆసక్తిగా తిలకిస్తూ, మధ్యమధ్యలో తనకు పేవ్‌మెంట్ మీద కనిపించిన చెత్తను ఉత్తచేతులతో తీసివేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీ స‍్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలను శుభ్రంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు.
తాజాగా ప్రధాని మోదీ మరోసారి స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీనే స్వయంగా చెత్త ఏరివేసి దేశ ప‍్రజలకు మరోసారి ‘స్వచ్ఛ భారత్‌’ సందేశాన్ని వినిపించారు ఢిల్లీలో నిర్మించిన ‘ప్రగతి మైదాన్‌ సమీకృత ట్రాన్స్‌పోర్ట్‌ టన్నెల్‌’ను ప్రారంభించిన అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను మోదీ పరిశీలించారు.

ఈ సందర్భంగా మోదీ అక్కడ కొంద దూరం ముందుకు సాగారు. ఈ క్రమంలో మోదీ.. అక్క​డ కనిపించిన చెత్త, ప్లాస్టిక్‌ సీసాను తన చేతులతో ఎత్తారు. అనంతరం పరిశుభ్రతను పాటించాలని చాటి చెప్పారు

ఇందుకు సంబంధించిన వీడియోను పశ్చిమబెంగాల్ బీజేపీ కో-ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ”పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే నిబద్ధతకు మోదీ కట్టుబడి ఉన్నారు. ఐటీపీఐ టన్నెల్ ప్రారంభోత్సవం సమయంలోనూ చెత్తను ఏరివేయడం ద్వారా ఆయన అందరికీ ఒక ఉదాహరణగా నిలిచారు” అని మాలవీయ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.