‘నెగెటివ్‌’ నుండి ‘స్థిరం’కు పెరిగిన భారత్ రేటింగ్

భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్‌’ను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ రెండేళ్ల తర్వాత ‘నెగెటివ్‌’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్‌ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల  మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం ‘బీబీబీ (–) మైనస్‌’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్‌ 2006 ఆగస్టులో ‘బీబీబీ–’కు అప్‌గ్రేడ్‌ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్‌ కొనసాగుతోంది. అయితే అయితే అవుట్‌లుక్‌ మ్రాతం ‘స్టేబుల్‌’–‘నెగటివ్‌’మధ్య ఊగిసలాడుతోంది. భారత్‌ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్‌ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్‌ తాజాగా పేర్కొంది.

అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో భారత్‌ ఎకానమీ అంచనాలను 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నామని తెలిపింది. 

మార్చిలో వేసిన అంచనాలు 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కుదించారు.  అంతర్జాతీయ కమోడిటీ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, కఠిన ద్రవ్య విధానం దీనికి కారణాలు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 8.7 శాతం పురోగమించింది.  

కాగా, కరోనా మహమ్మారి షాక్‌ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢమైన రికవరీని కొనసాగిస్తోంది. సహచర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్‌ పటిష్ట వృద్ధిలో పయనిస్తోంది. ఇది ఎకానమీపై మా అవుట్‌లుక్‌ మారడానికి కారణం.