బెంగాల్‌లో బీజేపీ ఆఫీస్‌కు నిప్పు

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హౌరాలో శుక్రవారం కొందరు ఆందోళనకు దిగి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. 
 
ఆందోళనకారులు రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. హౌరా-ఖరగ్‌పూర్ మార్గంలో చెంగల్ స్టేషన్ వద్ద ప్రజలు ఆందోళనకు దిగడంతో ఆగ్నేయ రైల్వే పలు రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది.  
 
మరోవైపు, హౌరాలోని ఉలుబెరియా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. పార్టీ కార్యాలయం తగలబడుతున్న వీడియోను బీజేపీ నేత అనిర్బన్ గంగూలీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
వారు ఆమె చెప్పేది విని, ఆమెకు తప్పకుండా ఓటు వేస్తారు కాబట్టి, ఈ మధ్యాహ్నం హౌరా రూరల్ జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, తగులబెట్టిన అల్లరిమూకలను, అల్లరిమూకలను వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ,హోం-పోలీస్ మంత్రి మమతా బెనర్జీ గుర్తించి అరెస్ట్ చేయగలగాలి. ఆమె ఎందుకు మౌనంగా ఉంది?” అంటూ  అనిర్బన్ గంగూలీ ట్వీట్ చేశారు.
 
అల్లర్లకు పాల్పడిన వారిని, రాళ్లు విసిరిన వారిని, కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీని డిమాండ్ చేశారు. “టిఎంసి ప్రాయోజిత గూండాలు” హింసకు పాల్పడ్డారని బిజెపి నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు.