పాకిస్థాన్ లో 22 లక్షల మంది హిందువులు

పాకిస్థాన్‌ దేశంలో 22 లక్షల మంది హిందువులున్నారని జాతీయ డేటాబేస్ నివేదిక వెల్లడించింది. దేశంలోని మొత్తం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్రమే హిందువులు ఉన్నారు.నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ సేకరించిన డేటా ఆధారంగా పాకిస్థాన్ దేశ మొత్తం జనాభాలో మైనారిటీలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నారని, అందులో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారని తేలింది.
తాజా డేటా ప్రకారం దేశంలో మొత్తం నమోదిత వ్యక్తుల సంఖ్య 18,68,90,601 కాగా, వీరిలో 18,25,92,000 మంది ముస్లింలు. ఎన్‌ఎడిఆర్ నుంచి కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డులు పొందిన మైనారిటీలపై సేకరించిన వివరాల ప్రకారం పాక్‌లో 17 విభిన్న మతాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 1400 మంది నాస్తికులు కూడా ఉన్నారు.
పాక్ దేశంలో నమోదిత హిందువులు 22,10,566 మంది, క్రైస్తవులు 18,73,348మంది,  సిక్కులు 74,130మంది, భాయిలు 14,537,3,917 మంది పార్సీలున్నారని పాకిస్తాన్‌లో జరిగిన మూడు జాతీయ జనాభా గణన ఆధారంగా నివేదిక పేర్కొంది.
బౌద్ధులు 1,787 మంది, చైనీస్ దేశీయులు 1,151మంది, షింటోయిజం అనుచరులు 628, యూదులు 628మంది, ఆఫ్రికన్ మతాల అనుచరులు 1,418 మంది, కెలాషా మతస్థులు 1,522మంది, జైనమతానికి చెందిన వారు  ఆరుగురు ఉన్నారు. హిందువుల్లో  95 శాతం మంది దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో నివసిస్తున్నారు.