రూ.1.41 లక్షల కోట్లకు జీఎస్‌టీ వసూళ్లు

జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌టీ వసూళ్లు వరసగా మూడో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్ల మార్క్‌‌‌‌ను అధిగ మించాయి.  ఈ ఏడాది మే నెలలో  రూ. 1,40,885 కోట్ల జీఎస్‌‌‌‌టీ రెవెన్యూని ప్రభుత్వం సంపాదించింది. కిందటేడాది మే నెలలో వచ్చిన రూ. 97,821 కోట్లతో పోలిస్తే ఈ సారి జీఎస్‌‌‌‌టీ వసూళ్లు 44 శాతం పెరిగాయి. 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో  రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్‌‌‌‌టీ రెవెన్యూ రాగా, జీఎస్‌‌‌‌టీ హిస్టరీలోనే ఇదే ఆల్‌‌‌‌టైమ్ హై. మే నెలలో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ను అధిగమించకపోయినా, జీఎస్‌‌‌‌టీ వచ్చిన తర్వాత నాల్గో అత్యధిక వసూళ్లుగా మే జీఎస్‌‌‌‌టీ వసూళ్లు నిలిచాయి. ఈ ఏడాది మార్చిలో రూ. 1.42 లక్షల కోట్ల రెవెన్యూని జీఎస్‌‌‌‌టీ కింద ప్రభుత్వం సంపాదించింది.

ఈ  ఏడాది జనవరిలో రూ. 1,40,986  కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1.33 లక్షల కోట్ల జీఎస్‌‌‌‌టీ రెవెన్యూ పొందింది. మే నెలలో రూ. 1,40,885 కోట్లు జీఎస్‌‌‌‌టీ కింద వచ్చాయి. ఇందులో సెంట్రల్‌‌‌‌ జీఎస్‌‌‌‌టీ (సీజీఎస్‌‌‌‌టీ) రూ. 25,036 కోట్లు. స్టేట్ జీఎస్‌‌‌‌టీ (ఎస్‌‌‌‌జీఎస్‌‌‌‌టీ) రూ. 32,001 కోట్లు కాగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌‌‌‌టీ (ఐజీఎస్‌‌‌‌టీ) రూ. 73,345 కోట్లు (ఇందులో రూ.37,469 కోట్లు దిగుమతులపై వేసిన జీఎస్‌‌‌‌టీ ద్వారా వచ్చాయి). 

ఇంకా సెస్‌‌‌‌ ద్వారా రూ. 10,502 కోట్లను ప్రభుత్వం సేకరించింది. ఇందులో దిగుమతులపై వేసిన సెస్ రూ. 931 కోట్లు కూడా కలిసి ఉన్నాయి’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో మొత్తం 7.4 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయని, అంతకు ముందు నెలతో పోలిస్తే  ఇవి 4 శాతం తక్కువని వివరించింది. 

వరసగా మూడో నెలలోనూ జీఎస్‌‌‌‌టీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లను అధిగ మించడం దేశ ఆర్థిక వృద్ధికి మంచి శకునమని భావిస్తున్నారు.  ఆడిట్స్ మెరుగవ్వడంతో  పన్ను ఎగవేతలు తగ్గాయని చెబుతున్నారు.  కరోనా రెండో వేవ్ సమయంలో  వృద్ధి తక్కువగా ఉందని, అందుకే ఏడాది ప్రాతిపదికన ఎక్కువ వృద్ధి ఉన్నట్టు కనిపిస్తోందని భావిస్తున్నారు.