ఉచిత బియ్యాన్ని అడ్డుకుంటున్న ఏపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)’ పథకం కింద పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యం, ఇతర రేషన్ సరుకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్ రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో 89 లక్షల కుటుంబాలకు, అంటే రాష్ట్ర జనాభాలో సగం మందికి కోవిడ్ లాక్‌డౌన్ సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని ఎందుకు నిలుపుదల చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంపిణీ నిలిపివేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేయడం లేదంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ డీసీపీ (డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్) రాష్ట్రమైనందున రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి, ఆహార భద్రతా చట్టం కింద నమోదైన లబ్దిదారులకు అవసరమైన నిల్వలను మిగిల్చుకుని, మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి అందజేయాల్సి ఉంటుందని జీవీఎల్ గుర్తుచేశారు. ఉచిత రేషన్ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు.

ఈ విషయంపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశామని, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. పేదలకు పక్కా గృహాలను అందించే ‘ప్రధానమంత్రి అవాస్ యోజన’ పథకాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రాజకీయం చేయకుండా

.