కేసీఆర్ వేలంలో ఎంపీ సీట్లు అమ్ముకున్నారు

సీఎం కేసీఆర్ వేలంలో ఎంపీ సీట్లను అమ్ముకున్నారని బీజీపీ ఎమ్మెల్యే ఎన్  రఘునందన్ రావు ఆరోపించారు.  రాజ్యసభ సభ్యత్వం పొందిన ముగ్గురు 40 ఎమ్మెల్యే స్థానాలను పంచుకున్నారన్న రఘునందన్ రావు, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని రాజ్యసభ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నారని విమర్శించారు.

పెద్దల సభ అంటే  సూటుకేసులు తెచ్చుకున్నోళ్లు వెళ్ళేది కాదని ఎద్దేవా చేశారు. పెద్దల సభ అంటే చదువుకున్నోళ్లు వెళ్ళాలి కానీ సంచులు తెచ్చినోళ్లు కాదని హితవు చెప్పారు.

పెద్దల సభకు విజ్ఞులను పంపాలని కోరుకుంటున్నట్లు చెబుతూ ఒకరు ఫార్మాలో మందులు అమ్మమంటే బీరువాలో డబ్బులు పెట్టుకున్నారని, మరొకరు ముఖ్యమంత్రికి డబ్బులు సమకూర్చే సిఎ కాగా,  మరొకరేమో అన్ని పార్టీలు తిరిగి,  గ్రానైట్ కుంభకోణంలో ఉన్న వ్యక్తి అని దయ్యబట్టారు.

కాగా, ఆర్ధిక నేరస్తులకు, పన్ను ఎగవేత దారులకు పెద్దపీట వేసి అభ్యర్థులుగా ప్రకటించారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యల ఎంపికతో ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో స్థానం లేదను రుజువైందని స్పష్టం చేశారు.

ఇక, ఏపీలో సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థిత్వాలను పరిశీలిస్తే తన సోదరి షర్మిల కోసమే జగన్ ఇక్కడి వారికి రాజ్యసభ సీటు కేటాయించారని అర్థమవుతుందని విమర్శించారు.