దేవాలయ భూములు అన్యాక్రాంతం పై హైకోర్టు ఆగ్రహం

పాత గుంటూరులోని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయ భూముల అన్యాక్రాంతం పట్ల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ స్వామి వారి కల్యాణోత్సవం కొరకు యెలవర్తి కుటుంబాచార్యులు   1914 లో 2 ఎకరాల ఆస్తి అయివేజు చేస్తూ వినియోగిచాలని ఈ దేవాలయానికి దాఖలు చేశారు.  
 తరువాత ఈ ఆస్తి దానం భూమి గా గుర్తుంపబడి ఎస్.  43 రిజిస్టర్ లో నమోదు అయింది. ఈ ఆస్తిని 2018-21 వరకు లీజు హోల్డ్ రైట్స్ ద్వారా ఎండోమెంట్స్ వారు వేలం వేసి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు.  ఈ భూమి పాత గుంటూరులో ఉన్నందున, కోట్ల రూ/-ల విలువ చేస్తున్నది.
అందువల్ల భూ మాఫియా కన్ను ఈ భూమిపై పడిందని, ఆ దేవాలయ మాన్యాలు కమిషనర్ వారిని మభ్యపెట్టి, ఈ ఆస్తి, మాన్యాలు దేవాలయానికి సంబంధం లేదని 43 రిజిస్టర్ నుండి డీ లిస్ట్ చేయుటకు కమిషనర్ వారి వద్ద నుండి ఉత్తర్వులు పొందారు. ఈ ఆస్తిని అన్యులకు విక్రయించుటకు, అక్రమ లాభం పొందుటకు ప్రయత్నములు జరుగుతున్నాయని తెలిసి కొంతమంది స్థానిక భక్తులు జూలూరి హేమాంగద గుప్తా హైకోర్టు న్యాయవాది సి.పి సోమయాజిని ఆశ్రయించారు. 
 
ఆయన ఆధ్వర్యంలో ప్రజా వ్యాజ్యం దాఖలు చేయగా హైకోర్టు బుధవారం ఈ కేసు పూర్వపరాలు  పరిశీలించి  ఆస్థి అందు  మూడవ పక్షం వారు ఎటువంటి అన్యాక్రాంతములు జరుపకూడదని హైకోర్టు ధర్మాసనం నుండి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,  హైకోర్టు జడ్జి యం. సత్యనారాయణ మూర్తి స్టే విధిస్తు మధ్యంతర ఉత్తరవులు వెలువర్చారు.