‘అలీ అంకుల్’ చేతివంట.. 25 బాలికలకు అస్వస్థత 

కలుషిత ఆహరం తిని నల్గొండ జిల్లా దామరచర్లలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఈనెల 19న  దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల హాస్టల్ లో జరిగింది.   విద్యార్థినులు ఆస్పత్రిలో  చిిిికిత్స పొందుతున్నారు.

తమ హాస్టల్లో వంట చేసే ‘అలీ అంకుల్’ కారణంగానే తమ తోటి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కొందరు బాలికలు మీడియాకు తెలియజేసారు. వంట చేసే సమయంలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం, వంట చేస్తున్న సమయంలో అలీ అంకుల్ చెమట తినే ఆహారంతో పడటం గమనించి తాము టిఫిన్ చేయడం కూడా మానేశామని చెప్పారు.

‘అలీ అంకుల్ గలీజ్ మనిషి’:
ఈ క్రమంలో విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, తమ హాస్టల్లో వంట చేసే అలీ అంకుల్ ‘గలీజ్’ వ్యక్తి అని, విద్యార్థినులతో ఆటను ప్రవర్తించే తీరు చాలా అసభ్యకరంగా ఉంటుందని, అతను చూసే విధానం చాలా చిరాకు తెప్పించేదిగా ఉంటుందని తెలిపారు. వెంటనే ‘అలీ అంకుల్’ని విధుల నుండి సస్పెండ్ చేయాలని కోరారు.

 

 

 

చర్యలు శూన్యం.. సోషల్ మీడియాలో విమర్శలు:
దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో వంట చేసే అలీ నిర్వాకంపై బాలికలు మీడియాకు ఇచ్చిన స్టేట్మెంట్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఐయ్యింది. కనీస పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆలీపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తెలిపింది.ఘటనపై కలెక్టర్ స్పందన:
ఈ ఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలికలను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.