
నకిలీ వార్తలతో దేశ భద్రతకు, సమగ్రతకు భంగం వాటిల్లుతున్న 16 యూట్యూబ్ న్యూస్ చానళ్లను నిషేధిస్తున్నట్లు కేం ద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పది యూట్యూబ్ చానళ్లు భారత్ కు సంబంధించినవి కాగా, ఆరు యూట్యూబ్ చానళ్లు పాకిస్తాన్‌కు సంబంధించినవి తెలిపారు.
ప్రస్తుతం నిషేధించిన యూట్యూబ్ చానళ్ల వివర్‌షిప్ 68 కోట్లు ఉందని, అయితే వీరు యూట్యూబ్ వేదికను భారత్‌లో భయాందోలనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని పాడు చేయడానికి, అలాగే ప్రజా జీవినానికి ఇబ్బంది కలిగించే విధంగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
వీటితో పాటు మరొక ఫేస్‌బుక్ ఖాతాను కూడా ప్రభుత్వం నిద్దెదించింది. కరోనా సమయంలో భారత్‌లో లాక్‌డౌన్‌పై అనేక తప్పుడు కథనాల్ని ఈ యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరిగిందని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని అబద్దాలు ప్రచారం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నిషేధించినవి:
భారత్ నుంచి 1. సైనీ ఎడ్యూకేషన్ రీసెర్చ్, 2. హిందీ మే దేఖో, 3. టెక్నికల్ యోగేంద్ర, 4. ఆజ్ తే న్యూస్, 5. ఎస్‌బీబీ న్యూస్, 6. డిఫెన్స్ న్యూస్ 24X7, 7. ది స్టడీ టైమ్స్, 8. లేటెస్ట్ లప్‌డేట్, 9. ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్, 10. తాహాఫుజ్ ఏ దీన్ ఇండియా
పాకిస్తాన్ నుంచి: 1. ఆజ్‌తక్ పాకిస్తాన్, 2. డిస్కవర్ పాయింట్, 3. రియాలిటీ చెక్స్, 4. కైసర్ ఖాన్, 5. ది వాయిస్ ఆఫ్ ఏషియా, 6. బోల్ మీడియా బోల్.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం