గుజరాత్ లో డిఆర్ఐ అధికారులు ఇరాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా గుజరాత్ కాండ్లా పోర్టుకు చేరుకున్న 17 కంటైనర్స్ లో రూ.1439 కోట్ల విలువైన 205 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ కు హెరాయిన్ తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్ డిపిఎస్ యాక్ట్ కింద అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
గుజరాత్ఎటిఎస్ అధికారులతో కలసి అభివృద్ధి చేసిన ఇంటెలిజెన్స్ ఆధారంగా, డిఆర్ఐ అధికారులు ఉత్తరాఖండ్ ఆధారిత సంస్థ కాండ్లా పోర్ట్‌లో దిగుమతి చేసుకున్న సరుకును పరిశీలిస్తుండగా అది ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ నుండి కాండ్లా పోర్టుకు చేరుకుంది.
17 కంటైనర్లలో (10,318 బ్యాగులు) దిగుమతి అయిన సరుకు 394 మెట్రిక్ టన్నుల బరువు ఉంది. దీనిని “జిప్సమ్ పౌడర్”గా ప్రకటించారు. ఇప్పటివరకు పోర్ట్‌లో సరుకుల సమగ్ర పరిశీలన ఇంకా కొనసాగుతోంది. దర్యాప్తులో, ఉత్తరాఖండ్‌లోని నమోదిత చిరునామాలో దిగుమతిదారుడిని ఇంకా గుర్తింపలేదు.
దీని ప్రకారం, దిగుమతిదారుని పట్టుకోవడానికి దేశవ్యాప్తంగా మాన్‌హాంట్ ప్రారంభించారు. దిగుమతిదారుని గుర్తించేందుకు డిఆర్ఐ భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. దిగుమతిదారు గుర్తింపును తప్పించుకోవడానికి లొకేషన్‌లు మారుస్తూ దాక్కున్నాడు.
అయినప్పటికీ, దిగుమతిదారు పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఉన్నాట్లు గుర్తించారు. అతను ప్రతిఘటించి పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు చేసిన విచారణ ఆధారంగా, అతడిని ఎన్ డిపిఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. అమృత్‌సర్‌లోని కోర్ట్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి భుజ్‌లోని న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు కోర్టు ట్రాన్సిట్ రిమాండ్‌ను పొందారు.
పాక్ పడవలో రూ 280 కోట్ల హెరాయిన్ పట్టివేత
మరోవంక, రూ 280 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థానీ ఓడ ‘అల్ హజ్’ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో సంయుక్త ఆపరేషన్‌లో భారత తీర రక్షక దళం సోమవారం గుజరాత్ రాష్ట్ర తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ ఓడను పట్టుకుని, అందులో ఉన్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.
పాకిస్థాన్ ఓడ ‘అల్ హజ్’ భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు భారత తీర రక్షక దళ నౌకలు అడ్డగించి పట్టుకున్నాయని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తదుపరి విచారణ కోసం పడవతో పాటు అందులో ఉన్న పాకిస్థాన్ సిబ్బందిని గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తీసుకువచ్చినట్లు రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు.
More Stories
నిషేధానికి ముందే అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత
కరోనా తర్వాత కంగనాకు అతిపెద్ద ఓపెనింగ్ ‘ఎమర్జెన్సీ’
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు