విద్యుత్ రంగంలో వెనుకబడిన తెలుగు రాష్ట్రాలు

నీతి అయోగ్‌ -విద్యుత్‌, పర్యావరణ సూచిక (స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ ఇండెక్స్‌ – సెకీ) రౌండ్‌-1 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ  బాగా వెనుకబడ్డాయి. తొలిసారిగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఓవరాల్‌గా 18వ స్థానం, పెద్ద రాష్ట్రాల్లో 12వ స్థానం లభించగా, పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు 11వ స్థానం లభించింది. 

 ఆరు కీలక కొలమానాల్లో ( 1.డిస్కంల పనితీరు, 2.లభ్యతా సమర్థతా వాస్తవికత, 3.హరిత ఇంధన విధానాలు, 4.ఇంధన సామర్థ్యం, 5.పర్యావరణ సుస్థిరత, 6.నూతన విధానాలు) 27 సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను సెకీ రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఢిల్లీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో నీతి అయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ విడుదల చేశారు. 

20 పెద్ద రాష్ట్రాల విభాగంలో పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్‌ (50.1), కేరళ (49.1), పంజాబ్‌ (48.6)తో అగ్రస్థానంలో నిలువగా, ఎపి 12వ స్థానానికి, తెలంగాణ 11వ స్థానానికి పరిమతమయ్యాయి. ఎపికి మూడు సూచిల్లో సున్నా, ఐదు సూచిల్లో పది కంటే తక్కువ స్కోరు రావడం గమనార్హం. కొత్త విధానాల కల్పనలో పూర్తిగా జీరో ఫలితాలు వచ్చాయి. 

విద్యుత్‌ వాహనాలు, ఛార్జిరగ్‌ సౌకర్యాల కల్పన, వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటులో నిల్‌గా నివేదిక చూపించింది. ఇక డిస్కమ్‌ల పనితీరుకు సంబంధిరచి రుణ విభాగం, నేరుగా నగదు బదిలీ విభాగాల్లో జీరో స్కోర్‌ను కేటాయిరచారు. వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీల అమలులో మాత్రం వంద శాతం మార్కులు పడ్డాయి.

డిస్కమ్‌ల పనితీరుకు సంబంధిరచిన విభాగంలో ఏపీకి 65.1 స్కోరు లభిరచగా, విద్యుత్‌ లభ్యత, సమర్థత, వాస్తవికత విభాగంలో 42.6, హరిత ఇంధనం విభాగంలో 16.9, విద్యుత్‌ సామర్థ్యం విభాగంలో 40, పర్యావరణ సుస్థిరత విభాగంలో 35 చొప్పున స్కోరు లభించింది. అలాగే కొత్త విధానాల అమలులో జీరో స్కోర్‌ ఇచ్చారు. 

పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాలో 100 స్కోరు సాధించిన ఎపి వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో మాత్రం కేవలం 5.6 స్కోర్‌కే పరిమితమైంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ను తొమ్మిది గంటలపాటు అరదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అతి తక్కువ స్కోరు లభించడం విశేషం.

గుజరాత్, కేరళ, పంజాబ్ భేష్ 

నీతి అయోగ్‌ పరిగణనలోకి తీసుకున్న రెండో ప్రధాన కొలమానం (లభ్యత, సమర్థత, వాస్తవికత)లో కేరళ 67.3 స్కోరుతో అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 60.4 స్కోరుతో తెలంగాణ, 57.4 స్కోరుతో ఒడిశా నిలిచాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా, క్రాస్‌ సబ్సిడీ సూచికల్లో కేరళ అత్యుత్తమ పనితీరును కనబర్చింది.

పెద్ద రాష్ట్రాలలో గుజరాత్‌, కేరళ, పంజాబ్‌ మొదటి మూడు స్థానాల్లో నిలవగా, చిన్న రాష్ట్రాలలో గోవా, త్రిపుర, మణిపూర్‌ అగ్రగామిగా ఉన్నాయి. ఇక, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఛండీగఢ్‌, ఢిల్లీ, డయ్యూడామన్‌ ా దాద్రానగర్‌ హవేలీ ముందంజలో ఉన్నాయి.