మిల్లర్లతో కుమ్మక్కై వడ్లు కొనని కేసీఆర్ 

మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన వరి దీక్షలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొని కేంద్రానికి ఇవ్వాలని స్పష్టం చేశారు.
కేంద్రం వడ్లు కొనడానికి సిద్ధంగా ఉంటె కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు దీక్ష చేపట్టారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చే డబ్బులన్నీ కేంద్రానివేనని ఆయన తెలిపారు. ప్రధాని మోదీతో కొట్లాడటానికి, రాష్ట్రాలు తిరగడానికి కేసీఆర్ వద్ద డబ్బులుంటాయి కానీ, రైతుల నుండి వడ్లు కొనడానికి లేవా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
ఏడేళ్లలో తెలంగాణ రైతుల కోసం కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసిందని మురళీధరన్‌ తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు.. కరప్షన్‌రావు, కమీషన్‌రావు అని మురళీధరన్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చీప్ మినిస్టర్ కాదని..చీఫ్ మిస్ లీడర్ అని దుయ్యబట్టారు.
కమీషన్ రావు దేశాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్, దుబ్బాకలో ప్రజలు టీఆర్ ఎస్ కు బుద్ధి చెప్పారన్నారు.ని అంటూ  సమస్యలపై ప్రశ్నిస్తే బిజెపి కార్యకర్తలను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ధ్వజమెత్తారు. తన  రాజకీయాల కోసం కేసీఆర్ రైతులను వాడుకుంటున్నారని చెబుతూ సన్న వడ్లు వేసిన రైతులు రోడ్డున పడ్డారని,. కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో దొడ్డు వడ్లు సాగు చేస్తుండన్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో సమన్వయ సమితులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల వడ్లను కేంద్రమే పక్కా కొంటుందని చెబుతూ బాయిల్డ్ రైస్ ఇవ్వనని కేసీఆర్ కేంద్రానికి లెటర్ రాసిచ్చాడని గుర్తు చేశారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం మద్ధతు ధర పెంచిందని చెప్పారు. రైతులకు భయపడే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తుండని దయ్యబట్టారు. 
రైతుల వడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని వడ్ల పంచాయితీ తెలంగాణలో ఎందుకు వచ్చిందో కేసీఆర్ చెప్పాలని కోరారు. చేతనైతే వడ్లు కొనాలని లేకపోతే కేసీఆర్ గద్దె దిగాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఇసుక దందా ..భూదందా చేసిండని..ఇపుడు రైస్ దందా చేస్తున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ ను గద్దె దిగించేందుకు బీజేపీ నేతలు పూనుకున్నారని వెల్లడించారు. 
 ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం‌ కొనాలని, కొనకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.   పరిపాలన వదిలేసి దద్దమ్మ మాదిరి ఢిల్లీలో ఎందుకు దర్నా చేస్తున్నారో సీఎం చెప్పాలని ఎద్దేవా చేశారు. బంగాఖాతంలో కలుపుతారో.. కలుస్తారో.. ముఖ్యమంత్రితో తేల్చుకుంటామని యెచ్చరించారు. 
 
దేశంలో ఎక్కడా లేని సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో పీకే ప్లాన్స్  పని చేయవని హితవు చెప్పారు. ఆత్మగౌరవం మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. మంత్రులు, అధికారులు ప్రజలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని, ఐదారు వేల కోట్లతో రైతుల పంటను కొనలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. 
 
పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అర్థమవుతోందని తెలిపారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.