సంగీత కళాశాలలో అన్యమత ప్రచారంపై నిరసన 

విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో అన్యమత ప్రచారంపై విశ్వ హిందూ పరిషద్, భజరందళ్, ధర్మధ్వజం , హిందు చైతన్య వేదిక, ఇతర హిందు సంస్థలు నిరసన పోరాటం చేయడంతో  సంగీత కళాశాల ” క్రైస్తవ నాటక ” ప్రదర్శనకు అనుమతులు రద్దు చేసింది.

శనివారం సాయంత్రం 6.30 కి ప్రారంభం అవ్వవలసిన క్రైస్తవ నాటిక అనుమతులు లేని కారణంగా ప్రదర్శనకు నోచుకోలేదు.
నగరం నడిబొడ్డున ఉన్న ఈ కళాశాలకు అత్యంత విలువైన భూములు ఉన్నాయి. కనకదుర్గమ్మ దేవస్థానం నుండి సంగీత కళాశాల ఏర్పాటుకై ప్రభుత్వం పొంది, హిందు దాతల సౌజన్యం తో నిర్మించారు. 

 
ఈ కళాశాల ప్రాంగణంలో నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలకు అనుమతులు ఇస్తుంటారు.  మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వమని గత కొంత కాలంగా హిందువులకు సంబంధించిన “లక్ష దీపారాధన”, “వాసవీ మాత ఆరాధన ” వంటి  కార్యక్రమాలకు అనుమతులు అడిగినా ఇవ్వలేదు.

కాని పూర్తిగా క్రైస్తవ మతానికి చెందిన పద్య నాటకం  అని పేర్కొంటూ “సాంసన్ డెలిలా” అనే క్రైస్తవ మత ప్రచార కార్యక్రమానికి అనుమతులు ఇచ్చింది. దీనిపై ఆ కళాశాల ప్రిన్సిపల్ ను మొదటగా ప్రశ్నించగా ఉన్నత అధికారుల నుండి ఒత్తిడులు ఉన్నాయని, తాను ఏమి చెయలేనని చెప్పారు.

ఎట్టి పరిస్థితులలో క్రైస్తవ కార్యక్రమాన్ని ఆపి తీరాలని, లేదంటే ఆ ప్రాగణం భవిష్యత్తు లో పూర్తిగా క్రైస్తవ మత ప్రచారానికి వేదిక గా మారిపొతుందని భావించిన హిందూ సంస్థలు అరెస్ట్ లకు భయపడకుండా ఏంత దూరం అయినా పోరాటం చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాయి. 

 
క్రైస్తవ ప్రచారానికి అనుమతులు రద్దు చేసే దాకా కదిలేది లేదని కళాశాల ప్రాగణం లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినా మండుటెండలో హిందుత్వ వాదులు కదలకుండా కుర్చున్నారు. సమయం గడిచే కొద్ది దీక్ష లో కూర్చున్న సభ్యుల సంఖ్య పెరుగుతుండటం, విషయం తేలే దాకా కదిలే ప్రసక్తి లేదని గట్టిగా భిష్మించుకు కూర్చున్నారు. 
 
దానితో,  విజయవాడ ఎసిపి స్వయంగా వచ్చి కళాశాల ప్రిన్సిపాల్, డైరేక్టర్ లతో మాట్లాడి ” క్రైస్తవ నాటిక ” కు అనుమతులు రద్దు చెయ్యించారు. పోలీస్ లు కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వమని ప్రకటించడంతో   హిందువులు నిరసన విరమించారు.