హిజాబ్ వివాదం ప్రభావం ఇప్పుడు విద్యార్థుల నుంచి టీచర్లపై కూడా పడింది. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇకపోతే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్‌సి) పరీక్ష ముగిసే వరకు విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫాం ఉండాలంటూ మార్చి 25న కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయమై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ ఆదేశా ప్రకారం.. విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫాం తప్పనిసరి. ఇదే నిబంధన టీచర్లకు కూడా వర్తిస్తుంది. పదవ తరగతి పరీక్ష హాలులోకి హిజాబ్ ధరించిన టీచర్లకు అనుమతి లేదు” అని స్పష్టం చేశారు.
ఇది 12 తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. హిజాబ్‌పై తాము టీచర్లను బలవంతం చేయడం లేదని, నచ్చనివాళ్లు పరీక్ష డ్యూటీని వదులుకుంటారని ఆయన పేర్కొన్నారు.

More Stories
మహిళ మార్ఫింగ్ ఫోటో వివాదంపై సీజేపీ నేతలకు నోటీసులు
శబరిమలలో బంగారు కిరీటం భద్రంగా ఉంది
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో భిన్నాభిప్రాయం