శ్రీలంక మంత్రి వర్గం రాజీనామా .. ప్రతిపక్షాలకు అధ్యక్షుని ఆహ్వానం 

 ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో నిరసనలకు తట్టుకోలేక శ్రీలంక మొత్తం మంత్రి వర్గం  రాజీనామా చేసింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాన మంత్రి మహింద రాజపక్స మినహా మొత్తం 26 మంది మంత్రులు  తమ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించారని విద్యాశాఖ మంత్రి దినేష్‌ గుణవర్ధనే మీడియాతో తెలిపారు. 
 
  రాష్ట్రపతి గోటాబ్యా రాజపక్స  ఈ సందర్భంగా ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని ఆహ్వానించారు. వారు కూడా మంత్రి పదవులు చేపట్టి నేడు దేశం ఎదుర్కొంటున్న సంక్షోభం పరిష్కారం కోసం కలసి పనిచేయాలని పిలుపిచ్చారు. 
 
అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సోమవారం ప్రతిపక్షాలను మంత్రుల శాఖలను అంగీకరించాలని, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటుం  అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి సహాయం చేయాలని ఆహ్వానించారు. “అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికి కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు” అని ఆయన  కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన తర్వాత, అధ్యక్షుడు రాజపక్సే సోమవారం కనీసం నలుగురు కొత్త మంత్రులను ప్రకటించారు. ఆయన సోదరుడు బాసిల్ రాజపక్సే స్థానంలో ఆదివారం రాత్రి వరకు న్యాయ శాఖ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని కొత్త ఆర్థిక మంత్రిగా అధ్యక్షుడు నియమించారు.  విదేశాంగ మంత్రిగా జిఎల్ పీరీస్, కొత్త విద్యాశాఖ మంత్రిగా దినేష్ గుణవర్దన, కొత్త రహదారుల శాఖ మంత్రిగా జాన్స్టన్ ఫెర్నాండో ప్రమాణ స్వీకారం చేశారు.

36 గంటల కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత సోమవారం ఉదయం అధ్యక్షుడు రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చెదురుమదురు నిరసనలు కొనసాగుతున్నాయి. మార్చి 31న ఆగ్రహించిన గుంపు అధ్యక్షుడి వ్యక్తిగత నివాసాన్ని చుట్టుముట్టడంతో దేశం అత్యవసర పరిస్థితిలో అమలులో ఉంది. 

 
ఆదివారం, శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు, వ్యతిరేకతను ప్రదర్శించడానికి ప్రయత్నించినందుకు 600 మందిని అరెస్టు చేశారు. కోపోద్రిక్తులైన ప్రజానీకం కొనసాగుతున్న సంక్షోభానికి రాజపక్సే కుటుంబాన్ని నిందిస్తున్నారు, ఇద్దరు సోదరులు ప్రధానమంత్రి, అధ్యక్షులుగా  అధికారంలో ఉన్నారు.
 
కాగా, ఆదివారం సాయంత్రం నుండి సోషల్‌ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.సోషల్‌ మీడియా నిషేధం, కర్ఫ్యూ వెరసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నిత్యావసర సరుకులు మండిపోవడంతో ప్రజలు, విపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దేశంలో ఆంక్షలున్నప్పటికీ.. ధిక్కరించి ఆందోళనలు చేపట్టారు. 
రాజపక్స కూడా పదవి నుంచి తప్పుకుంటారనే పుకార్లు వచ్చాయి.  అయితే వీటిని  శ్రీలంక ప్రధాన మంత్రి కార్యాలయం తోసిపుచ్చినది.  రాజపక్స రాజీనామా చేయలేదని పీఎం ఆఫీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక రాజీనామా చేసిన మంత్రుల్లో మహీందా తనయుడితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులే కావడం విశేషం. దీంతో ప్రజావ్యతిరేకత కొంతైనా తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడు ప్రధాని మహీందా.
 
కాగా, దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రపతి గోటాబ్యా రాజపక్సను కలసి మహింద రాజపక్స చర్చించారు. ఈ సమావేశంలో పలు దేశంలో నెలకొన్న పరిస్థితులు, సంక్షోభం గురించి సమాలోచనలు చేసినట్లు సమాచారం.