జమ్ముకశ్మీర్‌లో ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) హతమార్చిందని, మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నామని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాళ్లు విసిరే సంఘటనలు చాలా వరకు లేవని పేర్కొన్నారు.
అలాగే విదేశీ ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు కూడా తగ్గాయని వివరించారు. పలు రకాల సెక్యూరిటీ కవర్ కింద సుమారు 117 మందికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తుస్తోందని తెలిపారు. వీఐపీ సెక్యూరిటీ వింగ్‌లో 32 మంది మహిళా సిబ్బందిని నియమించామని చెప్పారు.
ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 41 మంది వీఐపీల భద్రతను సీఆర్పీఎఫ్ పర్యవేక్షించిందని, ఎన్నికల అనంతరం 27 మంది వ్యక్తులకు భద్రతను ఉపసంహరించినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు విధి నిర్వహణలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బందికి రిస్క్ ఫండ్ నుంచి అందించే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచామని వివరించారు.
ఇతర కేసుల్లో ఎక్స్‌గ్రేషియాను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. 2022లో ఇప్పటి వరకు 10 మంది సిబ్బంది మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఇందులో భాగంగా సిబ్బంది తమ సమస్యలను చెప్పుకునేందుకు ‘చౌపల్’ నిర్వహించడంతోపాటు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, శనివారం జమ్మూలోని ఎంఎ స్టేడియంలో సీఆర్పీఎఫ్ 83వ రైజింగ్ డే పరేడ్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్ విలువల నిర్వహింపనున్నారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి