
సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందుకు వెళ్ళమని తెలంగాణ హైకోర్టు సూచించింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
సస్పెండైన ఎమ్మెల్యేలను వెంటనే స్పీకర్ ఎదుట హాజరుపర్చాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు రిప్రజెంట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అదేశల ప్రకారం మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపే స్పీకర్ ముందు ఎమ్మెల్యేలే అభ్యర్థన చేసుకోవచ్చు.
మంగళవారం ఉదయంలోపు స్పీకర్ ఎదుట సస్పెండైన ఎమ్మెల్యేలు హాజరవ్వాలని హైకోర్టు సూచించింది. సభాపతిగా సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. సెంబ్లీకి గౌరవ అధ్యక్షులు స్పీకరేనని, సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం రేపు(మంగళవారం) ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపే స్పీకర్ ముందు ఎమ్మెల్యేలు అభ్యర్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. సభాపతి సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
మనది పార్లమెంటరీ డెమోక్రసీ అని, సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే పార్లమెంట్ డేమక్రసీ బలపడుతుందని గుర్తు చేసింది. ఎమ్మెల్యేలు సభ హక్కులు ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.
ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కలగజేసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.
.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!