భారతీయ ఆర్ధిక నమూనాకు పెద్దపీట… ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు 

మానవ కేంద్రంగా, శ్రమతో కూడుకున్న, పర్యావరణ అనుకూలమైన, వికేంద్రీకరణ, ప్రయోజనాల సమాన పంపిణీపై ఒత్తిడి తెచ్చి, గ్రామ ఆర్థిక వ్యవస్థ, సూక్ష్మ, చిన్న తరహా, వ్యవసాయ రంగాన్ని పెంపొందించే భారతీయ ఆర్థిక నమూనాకు పెద్దపీట వేయాలని  ఆర్‌ఎస్‌ఎస్ పిలుపిచ్చింది. 

గుజరాత్ లోని కర్ణావతిలో మూడు రోజులపాటు జరుగుతున్న సంఘ్ అభిక భారతీయ ప్రతినిధి సభల ఆమోదించిన ఒక తీర్మానంలో  ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్థిరమైన, సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, ఉపాధి కల్పన కోసం భారత్ కేంద్రీకృత నమూనాలపై పని చేయాలని స్పష్టం చేసింది. 

ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ తన సముచిత స్థానాన్ని తిరిగి పొందేలా వివిధ రకాల పని అవకాశాలను ప్రోత్సహించే మొత్తం ప్రయత్నాన్ని ఉత్ప్రేరకపరిచే మన శాశ్వతమైన విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన పని సంస్కృతిని నెలకొల్పాలని  సమాజంలోని అన్ని వర్గాలను కోరింది.

వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక , సాంకేతిక దృష్టాంతంలోని సవాళ్లను పరిష్కరించడానికి మనం  ఒక సమాజంగా వినూత్న మార్గాలను వెతుకుతున్నామని పేర్కొంటూ   అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతి అవకాశాలతో ఉపాధి అవకాశాలు, వ్యవస్థాపకత అవకాశాలను తీవ్రంగా అన్వేషించాలని సూచించింది. 

మొత్తం ఉపాధి సవాళ్లను తగ్గించడానికి పని అవకాశాలను ఉపయోగించుకోవడంలో మొత్తం సమాజం చురుకైన పాత్ర పోషించ వలసిన అవసరాన్ని  ఆర్‌ఎస్‌ఎస్ ఈ తీర్మానంలో ప్రస్తావించింది . సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, అపారమైన మానవ శక్తి మరియు మన వ్యవసాయం, తయారీ, సేవా రంగాలను మార్చడానికి స్వాభావికమైన వ్యవస్థాపక నైపుణ్యాలతో భారత్ పుష్కలమైన పని అవకాశాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని గుర్తుచేసుకుంది.

ఉద్యోగం ముందు, తర్వాత కూడా  మానవశక్తి శిక్షణ, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, గ్రీన్ టెక్నాలజీ వెంచర్‌లకు ప్రేరణ మొదలైన వాటిలో మనం నిమగ్నమై ఉండాలని పేర్కొన్నది.  గ్రామీణ ఉపాధి, అసంఘటిత రంగ ఉపాధి, మహిళలకు ఉపాధి,  ఆర్థిక వ్యవస్థలో వారి మొత్తం భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

మన సామాజిక పరిస్థితులకు తగినట్లుగా కొత్త సాంకేతికతలు, సాఫ్ట్ స్కిల్స్‌ను స్వీకరించడానికి ప్రయత్నాలు చాలా అవసరం అని తెలిపింది. దేశంలోని ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఇటువంటి అవకాశాల ఆధారంగా ఉపాధి కల్పనలో అనేక విజయవంతమైన నమూనాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ గుర్తు చేసింది.

వారు స్థానిక ప్రత్యేకతలు, ప్రతిభ, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొంటూ అనేక ప్రదేశాలలో వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాలు మరియు స్వచ్ఛంద సంస్థలు విలువ ఆధారిత ఉత్పత్తులు, సహకార రంగం, స్థానిక ఉత్పత్తుల ప్రత్యక్ష మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి మొదలైన రంగాలలో ప్రయత్నాలను ప్రారంభించారని వివరించింది. 

ఇటువంటి కార్యక్రమాలు హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్, హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ , ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజెస్ వంటి వెంచర్‌లను ప్రోత్సహించాయి. కొన్ని విద్యా , పారిశ్రామిక సంస్థలు గణనీయమైన రీతిలో ఉపాధి కల్పన ప్రయత్నాలలో దోహదపడ్డాయని కొనియాడింది.  బలహీన, అణగారిన వర్గాలతో సహా సమాజంలోని పేద వర్గాలకు స్థిరమైన పని అవకాశాలను సృష్టించగలిగిన అన్ని విజయ గాథలను  ఆర్‌ఎస్‌ఎస్   అభినందిస్తుంది. 

సమాజంలో ‘స్వదేశీ, స్వావలంబన’ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నాలు ఇటువంటి  కార్యక్రమాలకు సరైన ప్రేరణనిస్తాయని తెలిపింది.  దిగుమతులపై మనం  ఆధారపడటాన్ని కూడా తగ్గించగల అధిక ఉపాధి అవకాశాలను కలిగి ఉన్న మన తయారీ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని  ఆర్‌ఎస్‌ఎస్  ఈ తీర్మానంలో ప్రస్తావించింది.

. ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని సూచించింది. తద్వారా వారు ఉద్యోగాలను మాత్రమే కోరుకునే మనస్తత్వం నుండి బయటపడవచ్చని తెలిపింది.

మహిళలు, గ్రామ ప్రజలు, మారుమూల, గిరిజన ప్రాంతాల ప్రజలలో కూడా ఇలాంటి వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని స్పషటం చేసింది.  విద్యావేత్తలు, పరిశ్రమలు , సామజిక   నాయకులు, సామాజిక సంస్థలు, ఇతర సంస్థలు ఈ దిశగా సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నది. అందుకోసం ప్రభుత్వ, ఇతర ప్రయత్నాలన్నీ కలిసి సాగడం తప్పనిసరి అని తీర్మానంలో స్పష్టం చేసింది.