అహంకారమే అఖిలేష్ ఆశలను తలకిందులు చేసిందా! 

ఎన్నికల ఫలితాలతో లక్నోలోని బీజేపీ కార్యాలయంలో పండుగ సందడి నెలకొంది. అందుకు భిన్నంగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో ఘోరమైన నిశ్శబ్దం నెలకొంది. కొద్దిమంది పార్టీ కార్యకర్తలు మూసి ఉన్న పార్టీ ప్రధాన గేటు బయట తిరుగుతున్నారు. ‘ఎన్నికల్లో బీజేపీ అవకతవకలు చేసింది. చాలా చోట్ల ఈవీఎంలను మార్చారు. ఈ ఎన్నికల ఫలితాలు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. లేదు, అది సాధ్యం కాదు, ”అని ఆ పార్టీ  నాయకుడు ఒకరు వాపోతున్నారు.

ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని పార్టీ కార్యకర్తల మనోభావాలను సమర్థించారు. “వేలాది మంది ప్రజలు అఖిలేష్ యాదవ్ కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు ఎలా నిరీక్షించారో చూశారు. అఖిలేష్ యాదవ్‌కు అనుకూలంగా గ్రౌండ్‌వెల్ ఉంది, కానీ ఈ రోజు ఏమి జరిగిందో వివరించలేనిది” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ నాయకులు నిపుణులు. మరోసారి అదే చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఎంతగానో నిరుత్సాహానికి గురై లక్నోలోని విధానసభ వెలుపల ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని రక్షించారు.

ఎందువల్లన ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి ఇప్పుడే చెప్పలేము. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడు  బిజెపి విజయాన్ని రెండు పదాలలో అభివర్ణించారు. అవి, రేషన్,  ప్రశాషన్ (ఉచిత రేషన్, మంచి పరిపాలన). పాలనలో క్షేత్ర స్థాయిలో కొన్ని లోపాలున్నట్లు, నిరుద్యోగం పెరుగుతోందని ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వం తమకు అండగా ఉంటున్నదనే  ప్రజలలో నెలకొన్న బలమైన భావన ఆ పార్టీ విజయానికి ప్రధానంగా తోడ్పడింది. 

మరోవంక,  అఖిలేష్ యాదవ్  అహంకారం  కొంతమంది సీనియర్ నాయకులను విస్మరించడానికి దారితీసింది. బహుశా తన గెలుపుపై మితిమీరిన విశ్వాసంతో  ఉన్న ఆయన ఇతర సీనియర్ నేతలను ప్రచారంలో ఉపయోగించుకోలేదు. ఫలితంగా, ఒంటరి యోధుడయ్యాడు, దీనికి విరుద్ధంగా, బిజెపి సీనియర్ నాయకులందరూ క్రమం తప్పకుండా యుపి పొడవునా విస్తృతంగా పర్యటించడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో కేన్ డెవలప్‌మెంట్ మంత్రి సురేశ్ రాణాతో సహా సీనియర్ బీజేపీ నేతలు ఓడిపోయినప్పటికీ, వ్యవసాయ ఆందోళనలు అంతగా ప్రభావం చూపలేదని పశ్చిమ యూపీలో బీజేపీ బాగా పనిచేసిన తీరు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. నోయిడాలో పర్యటించిన ముఖ్యమంత్రి మళ్లీ అధికారంలోకి రాలేరన్న మూఢవిశ్వాసంను బద్దలు కొట్టేందుకు కూడా ఈ ఎన్నికలు యోగి ఆదిత్యనాథ్‌కు దోహదపడ్డాయి.

యోగి ముఖ్యమంత్రి అయితే, 1985 తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో అఖండ విజయం సాధించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నరేన్ దత్ తివారీ సీఎం కావడం, సీఎం తిరిగి అధికారంలోకి రావడం  ఇది రెండోసారి మాత్రమే. ఆ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చే ఏకైక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దీనికి ముందు, కళ్యాణ్ సింగ్ , రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రానికి బిజెపి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పార్టీని గెలిపించలేక పోయారు.

2022లో బిజెపి విజయాన్ని 1985లో కాంగ్రెస్‌ విజయంతో పోల్చి చూస్తే – కాంగ్రెస్‌కు 39.25 శాతం ఓట్లతో 269 సీట్లు వచ్చాయి.  అయితే బీజేపీ 42 శాతానికి పైగా ఓట్లతో దాదాపు అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని అంచనా. 1980లో కూడా యూపీలో కాంగ్రెస్ 309 సీట్లు గెలుచుకోగా, 2017 ఎన్నికల్లో బీజేపీ 326 సీట్లు సాధించింది.

ఇక అఖిలేష్ తన కుటుంభ సభ్యులను సహితం తనతో తీసుకెళ్లలేక పోయారు.  మరదలు అపర్ణా యాదవ్ గెలుపొందడం కోసం  బిజెపికి వెళ్లినప్పుడు, అఖిలేష్ ఆమెను నిలుపుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రచార సమయంలో, ఇతర కుటుంబ సభ్యులు కూడా దాదాపు కనిపించలేదు. ఎస్పీలో  అఖిలేష్ ఎదుగుదలపై తిరుగుబాటు చేసి సొంత పార్టీని స్థాపించిన మామ శివపాల్ యాదవ్, ఆ పార్టీ  గుర్తుపై పోటీ చేసినా కేవలం రెండు ప్రచార ప్రదర్శనలతో మాత్రమే కనిపించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న 84 ఏళ్ల తండ్రి ములాయం సింగ్ యాదవ్  కూడా ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు. ఆయన  ఒకసారి అఖిలేష్ సీటు కర్హల్ (మెయిన్‌పురి)లో, మరోసారి మల్హానిలో తన సన్నిహితుడైన పరస్నాథ్ యాదవ్ కుమారుడు లక్కీ యాదవ్ కోసం ప్రచారం చేశారు. కుటుంభ సభ్యులను పక్కన పెట్టడం ద్వారా బిజెపి చేస్తున్న  “పరివార్వాద్ (బంధుప్రీతి)” ఆరోపణలను మట్టుబెట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఎన్నికలకు సమయంలో  బిజెపి అగ్రనేతలు  ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నుండి బిజెపి అధ్యక్షులు  జెపి నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు అందరు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎస్పీకి దాదాపు ఒంటరిగా  అఖిలేష్ ప్రచారం చేయవలసి వచ్చింది. . ఎస్పీ కేవలం యాదవుల పార్టీ కాదని తెలియజేసేందుకు చిన్న చిన్న పక్షాలతో పొత్తులు పెట్టుకొని, వారితో  131 ర్యాలీలు చేసినా ఫలించలేదు.