ఆహార సరఫరాకు ముప్పు తెస్తున్న ఉక్రెయిన్ యుద్ధం!

ఉక్రెయిన్‌ను చుట్టుముట్టిన రష్యాన్ ట్యాంకులు, క్షిపణులు ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ప్రజల ఆహార సరఫరా, జీవనోపాధికి కూడా ముప్పు కలిగిస్తున్నాయి. వారంతా ‘ప్రపంచ బ్రెడ్‌బాస్కెట్’గా గుర్తింపు పొందిన నల్లసముద్రపు ప్రాంత సారవంత భూములపై ఆధారపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా లక్షలాది మంది పలాయనం చిత్తగిస్తుంటే, కొందరు దేశం కోసం పోరాడుతున్నారు లేక బతికి ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఉక్రెయిన్‌లోని రేవుపట్టణాలను మూసేశారు. ఇంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న మరో దేశం రష్యా. పాశ్చాత్య దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించకపోతే అక్కడి నుంచి గింజధాన్యాలు ఎగుమతి అయ్యేవి. ప్రపంచవ్యాప్తంగా గోధుమ సరఫరాలో ఎలాంటి అవరోధం లేదు. 

కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ఒక వారం ముందు నుంచే గోధుమ ధరలు 55 శాతం పెరిగాయి. యుద్ధం ఇలా కొనసాగితే ఉక్రెయిన్ ఎగుమతులపై ఆధారపడిన దేశాలు జులై నాటికి గోధుమ లోటును ఎదుర్కొనగలవని ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ డైరెక్టర్ అర్నాడ్ పెటిట్ ఇటీవల ‘ది అసోసియేట్ ప్రెస్’ అనే వార్తా సంస్థకు తెలిపారు.

గోధుమ లోటు తర్వాత ఆహార అభద్రతకు దారితీయగలదు. లెబనాన్, ఈజిప్టు వంటి దేశాల్లో ప్రజల పేదరికానికి దారీతీయనుంది. అక్కడ ఆహారం ప్రభుత్వ సబ్సిడీ బ్రెడ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాలు ప్రపంచంలో మూడో వంతు గోధుమలను ఎగుమతి చేస్తున్నాయి. ఉక్రెయిన్ ఇంకా మొక్కజొన్న ప్రధాన ఎగుమతిదారుగాను, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతిలో గ్లోబల్ లీడర్‌గాను ఉంది. 

2011 నుంచి అత్యధిక స్థాయికి ధరలు చేరుకున్న తరుణంలో యుద్ధం ఆహార సరఫరాను తగ్గించేయనుంది. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగితే దాని ప్రభావం ఉక్రెయిన్‌కు 15 మైళ్ల (2400 కిమీ.) దూరంలో ఉన్న ఈజిప్ట్‌పై పడగలదు. ఉక్రెయిన్ గింజధాన్యాల కారణంగానే ఈజిప్టులో లక్షలాది మంది సబ్సిడీ బ్రెడ్‌ను పొందగలుగుతున్నారు. దాదాపు మూడో వంతు మంది దారిద్య్రంలో జీవిస్తున్నారు. 

ఈజిప్టు రష్యా, ఉక్రెయిన్ నుంచే అత్యధికంగా గోధుమలను కొనుగోలు చేస్తుంటుంది. ఈజిప్టులో బ్రెడ్ అత్యధిక సబ్సిడీ ధరకు లభిస్తుంది. అలాంటి ఈజిప్టు వారంలో రెండు ఆర్డర్లను అత్యధిక ధరల కారణంగా, అనుకున్న ధరల్లో అమమకాలు చేసే కంపెనీలు లేకపోవడంవల్ల రద్దు చేసింది. ఉక్రెయిన్ సరఫరాపై ఆధారపడిన సిరియా, లెబెనాన్ ఇప్పుడు గోధుమల సరఫరాకు అమెరికా, భారత్, కెనడాను సంప్రదిస్తున్నాయి.