మరో మహారాష్ట్ర మంత్రి ఆస్తులను సీజ్ చేసిన ఈడీ 

మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  మహారాష్ట్రలో కీలకమైన మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను సీజ్ చేయడంతో పాటు అరెస్ట్ చేయగా, తాజాగా మరో మంత్రి  ప్రజక్త్ తాన్‌పురేతో పాటు ఇతరులకు చెందిన 94 ఎకరాల భూముని  మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్ సీబి)లో జరిగిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోమవారం జప్తు చేసింది.

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌తో పొత్తుతో అధికారంలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర ఏజెన్సీ నుండి దర్యాప్తులను ఎదుర్కొనే నాల్గవ నాయకుడు ఈయన.

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను గత వారం అరెస్టు చేయగా, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రత్యేక కేసులో  ఇదివరకే అరెస్ట్ చేశారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సంబంధం ఉన్న చక్కెర మిల్లును ఈడీ  గత ఏడాది అటాచ్ చేసింది.

ఇంతకుముందు ఏజెన్సీ ఈ కేసులో ప్రశ్నించిన  తాన్‌పురే మహారాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, ఇంధనం, గిరిజనాభివృద్ధి, ఉన్నత, -సాంకేతిక విద్య,  విపత్తు నిర్వహణ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన  రాహురి అసెంబ్లీ స్థానం నుండి ఎన్సీపీ ఎమ్మెల్యే.

సహకార చక్కెర కర్మాగారాలను అప్పటి అధికారులు, బ్యాంకు డైరెక్టర్లు తమ బంధువులకు, కొంతమందికి చాలా తక్కువ ధరలకు విక్రయించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. కేసు ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆగస్టు 2019లో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇది ఈ కేసును చేపట్టింది.

మహారాష్ట్ర సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను మోసపూరిత మార్గాల ద్వారా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విచారణకు బాంబే హైకోర్టు 2019 ఆగస్టు 22న ఆదేశించిన తర్వాత పోలీసు ఫిర్యాదు వచ్చింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం, గతంలో రామ్ గణేష్ గడ్కరీ సహకరి సఖర్ కార్ఖానా (ఎస్‌ఎస్‌కె)కి చెందిన 90 ఎకరాల భూమి తక్షశిల సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉంది. అహ్మద్‌నగర్ జిల్లాలోని  ప్రజక్త్ తాన్‌పురేకు చెందిన రూ 7.5 కోట్ల విలువగల  4.6 ఎకరాల వ్యవసాయేతర భూములను జప్తు చేశారు. ఈ భూముల మొత్తం విలువ రూ.13.41 కోట్లుగా పేర్కొంది.


“ఎంఎస్ సీబి 2007లో తక్కువ ధరకు రామ్ గణేష్ గడ్కరీ 
ఎస్‌ఎస్‌కె  వేలాన్ని చేపట్టింది. ఎలాంటి ప్రక్రియ లేకుండానే, ఆ  ఎస్‌ఎస్‌కె   ని ప్రసాద్ షుగర్ అండ్ అలైడ్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్, ప్రజాక్త్ తాన్‌పురే (ప్రసాద్ తాన్‌పురే కుమారుడు) సంస్థకు రిజర్వ్ ధర రూపో 26.32 కోట్లు ఉంటె  రూ. 12.95కే  విక్రయించారు” అని ఇడి ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రసాద్ షుగర్ “ఏకైక బిడ్డర్” అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కనుగొంది,  బిడ్ ప్రక్రియను పోటీగా ప్రొజెక్ట్ చేయడానికి, బిడ్ పత్రాలపై ‘సెకండ్ బిడ్డర్’ సంతకాన్ని ఎంఎస్ సీబీఐ అధికారులు తీసుకున్నారు. “ఈ ‘రెండవ బిడ్డర్’ అవసరమైన డబ్బు డిపాజిట్ మొత్తాన్ని డిపాజిట్ చేయలేదు. దానిని ప్రసాద్ షుగర్  ప్రాక్సీగా గుర్తించారు.

“2007లో వేలం నిర్వహించినప్పటికీ, 2010లో ప్రసాద్ షుగర్ 52 రోజులలోపు చెల్లింపును పూర్తి చేయాలనే చట్టబద్ధమైన షరతుకు వ్యతిరేకంగా అమ్మకపు మొత్తాన్ని చెల్లించింది” అని ఏజెన్సీ ఆరోపించింది.  ప్రసాద్ సాగర్ చెల్లింపు కోసం ఉపయోగించిన ఫండ్ “ఎటువంటి హేతుబద్ధత లేకుండా” ఇతర పార్టీల నుండి ఎక్కువగా స్వీకరించబడిందని మనీ ట్రయల్ దర్యాప్తులో తేలింది.

1995 నుండి 2004 వరకు రామ్ గణేష్ గడ్కరీ ఎస్‌ఎస్‌కె మాజీ ఛైర్మన్ రంజిత్ దేశ్‌ముఖ్ నుండి కూడా ఎస్‌ఎస్‌కె కొనుగోలుకు కొంత నిధులు వచ్చినట్లు కనుగొన్నారు. 


“ప్రసాద్ షుగర్ అనేది   ప్రసాద్ తాన్‌పురే   కుటుంబం ఆధీనంలో ఉన్న సంస్థ.  అతను ఆగస్టు 2004-మార్చి 2010 మధ్య కాలంలో ఎంఎస్ సీబి డైరెక్టర్ల బోర్డులో ప్రముఖ, ప్రభావవంతమైన సభ్యులలో ఒకరు” అని ఈడీ తెలిపింది. 
ఎస్‌ఎస్‌కె మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత, ప్లాంట్, మెషినరీని విడదీసి, రవాణా చేసి, అహ్మద్‌నగర్‌లోని వాంబోరిలో కొత్త ప్రదేశంలో అమర్చినట్లు ఏజెన్సీ పేర్కొంది.

“భూమి, నిర్మాణాన్ని 2011లో తక్షశిల సెక్యూరిటీస్‌కు విక్రయించారు” అని పేర్కొంది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, ఆయన భార్యకు సంబంధించిన కంపెనీ ప్రమేయం ఉందని పేర్కొంటూ గతేడాది ఈడీ రూ.65 కోట్ల విలువైన చక్కెర మిల్లును జప్తు చేసింది.