పుతిన్ నోట అణ్వాయుధ దళాల ప్రస్తావనతో కలకలం

ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో తమ అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించడం కలకలం రేపుతోంది. యుద్ధంలో అణ్వాయుధాల వినియోగం చెలరేగుతుంది.  మరోవంక ఉక్రెయిన్ కూడా అన్వయుధాలను సమాకరించుకొంటున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.
అన్వయుధాల ప్రయోగంపై దారితీసే మొత్తం ఐరోపాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అణ్వస్త్రాల ప్రయోగంపై నియంత్రణకు సంబంధించి రష్యాతో గల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించడంతో, రష్యా సహితం యథేచ్ఛగా వాటిని ఉపయోగించే అవకాశం ఏర్పడింది. 
ఈ పరిణామాలతో ఐక్యరాజ్యసమితి  ఆధ్వర్యంలోని యూఎన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) కమిటీ అత్యవసర సమావేశం బుధవారం జరగనుంది. 35 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.  మరోవైపు అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఆదేశించడం ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యమని నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్ బర్గ్ హెచ్చరించారు. 
 
శాంతి చర్చలకు ఉక్రెయిన్ సిద్ధం 
మరోవంక, రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని ఉక్రెయన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించడంతో యుద్ధ తీవ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు అంగీకారం తెలిపారు. బెలారస్ వేదికగా చర్చలు జరిపేందుకు రష్యా చేసిన ప్రతిపాదనను నిరాకరించిన జెలెన్‌స్కీ కొద్దీ గంటలకే సిద్ధం అంటూ ప్రకటించారు. 
 
బెలారస్ గడ్డపై నుంచి కూడా తమపై దాడులు జరుగుతున్నందున ఉక్రెయిన్‌పై దూకుడు ప్రదర్శించని ప్రాంతంలో చర్చలకు జరపడానికి వస్తామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. బెలారస్‌లో మాత్రం శాంతి చర్చలు జరపమని స్పష్టం చేశారు. అప్పటికే రష్యా పంపించిన ప్రతినిధి బృందం ఆసరికే బెలాసర్ చేరుకుంది. 
 
ఉక్రెయిన్ బృందం రాకపోవడంతో చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృథా చేస్తోందనంటూ పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికి ఉక్రెయిన్ సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. రష్యా ఆహ్వానాన్ని ఒప్పుకోవాలంటూ బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో సైతం ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
వీలైనంత త్వరగా ఉక్రెయిన్ చర్చలు జరపడం మంచిదని ఆయన సూచించారు. దీంతో కొద్ది గంటల్లోనే జెలెన్‌స్కీ మనసు మార్చుకున్నారు. బెలారస్‌లో చర్చలకు అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా, ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం నేపథ్యంలో డబ్బు ఆర్జన నుంచి రష్యా దేశ మీడియా నియంత్రిస్తున్నట్టు అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇలాంటి చర్యలే దానీ అనుబంధ సంస్థ యూట్యూబ్, అలాగే ఫేస్‌బుక్ సంస్థలు కూడా విధించాయి.
 
 ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాపై చర్యల నేపథ్యంలో రష్యాకు చెందిన మీడియా సంస్థలపై గూగుల్ మోనెటైజేషన్‌ను నిలుపుదల చేసినట్టు గూగుల్ అధికార ప్రతినిధి ప్రకటించారు. కొత్త పరిణామాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
 
వీడియోల మోనెటైజింగ్ నుంచి రష్యన్ మీడియా చానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పటికే సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ రష్యా మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.