టి20లో శ్రీలంక సిరీస్ భారత్ కైవసం

శ్రీలంకతో జరిగిన రెండో టి20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. .శ్రేయస్ అయ్యర్ అర్ధసెంచరీకి తోడు సంజూ శాంసన్, రవీంద్ర జడేజా చెలరేగడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే మూడు కోల్పోయి సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా 11 టీ20 మ్యాచ్‌లను గెలిచిన భారత్ రికార్డు సృష్టించింది.

తొలుత లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 భారీ స్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో భారత్‌ 17.1 ఓవర్ల లో కేవలం 3వికెట్లు కోల్పోయి.. 186 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్‌ అయ్యర్‌(74 నాటౌట్‌; 44బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధ సెంచరీకి తోడు.. సంజు(39; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు), జడేజా(45; 18 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. 

దీంతో టీమిండియా మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసు కుంది. మూడో, ఆఖరి టి20 ఆదివారం జరగనుంది. అంతకుముందు టాస్ గెలిచిన రోహి త్ సేన ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో లంక ఓపెనర్లు నిస్సంక, గుణతిలక నిలకడగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు.

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులను జోడించారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా బౌలింగ్ గుణతిలక (38) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. పెనర్లు నిస్సంక(75), గుణతిలకే(38) కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జతచేశారు. తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత లంక జట్టు పుంజుకుంది.

పాథుమ్‌ నిస్సంక(75) మాత్రం భారత బౌలింగ్‌ దళానికి ఎదురు నిలిచాడు. అతనితోపాటు చివర్లో దాసున్‌ శనక(47నాటౌట్‌; 19బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సర్లు) రాణించారు. లంక బ్యాటర్లలో నిస్సంక హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. దనుష్క గుణతిలక(38), చరిత్‌ ఆసలంక(2), కమిల్‌ మిషార(1), దినేష్‌ చండిమాల్‌(9) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, చాహల్‌ తలో వికెట్‌ తీశారు. ఛేదనలో టీమిండియా తొలుత తడబడింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(1), ఇషన్‌ కిషన్‌(16) త్వరగా పెవీలియన్‌కు చేరిపోయారు. శ్రేయస్‌-సంజు కలిసి మూడో వికెట్‌కు 84 పరుగులు జతచేస్తే.. ఆ తర్వాత శ్రేయస్‌-జడేజా మిగతా పని కానిచ్చారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శ్రేయస్‌కు దక్కింది.