కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడండి.. కేంద్ర బిజెపి భరోసా

కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై పోరాటాలు కొనసాగించమని రాష్ట్ర బిజెపి నేతలకు కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఏడున్నరేళ్లుగా సీఎం కేసీఆర్‌ తెలంగాణకు చేసిన అన్యాయంపై పోరాడమని మార్గనిర్ధేశం చేసింది. అధికార పార్టీ నేతల అక్రమాలను ఎక్కడికక్కడ ఎండగట్టండి. అవసరమైతే జైల్‌భరోలకు సిద్ధంకండని సూచించింది.
తాము అండగా ఉంటామని, మిగతా విషయాలు తమకు వదిలివేయమని భరోసా ఇచ్చింది. కేసీఆర్ నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు చేస్తుండడం పట్ల కేంద్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ‘‘కేసీఆర్‌ ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఎవరిపై మాట్లాడుతున్నారు? ఎప్పటికప్పుడు మాకు నివేదికలు వస్తున్నయి. అవన్నీ మేం చూసుకుంటాం. యూపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణపై కార్యాచరణ ఉంటుంది’’ అని స్పష్టం చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ఛుగ్‌,  మంత్రి ప్రహ్లాద్‌జోషీలతో బుధవారం ఢిల్లీలో విడివిడిగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బృందం సభ్యులు పార్టీ జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు.
కేసీఆర్‌ సర్కార్‌ బెంగాల్‌ ప్రభుత్వం తరహాలో దాడులు చేస్తోందని ఫిర్యాదు చేశారు.  పార్టీలో పలుకుబడి ఉన్న నాయకులను మండలాలవారీగా గుర్తించి డబ్బులు ఎరవేస్తోందని ఆరోపించారు. లొంగనివారిపై పోలీసుల సాయంతో పీడీయాక్టు, రౌడ్‌షీట్‌లు తెరిచి వేధిస్తోందని వివరించారు. ‘
‘బీజేపీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు ఎన్ని చేయాలో  అన్నీ చేస్తున్నారు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51శాతం ఉంటే, కేంద్రానికి 49 శాతం మాత్రమే. అధికార యంత్రాంగం,  పాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నా, సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందంటూ కార్మికులను రెచ్చగొడుతున్నారు” అని తెలిపారు.
బయ్యారంలో ఉక్కు నాణ్యతలేదని, అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీయే ప్రకటించినా,   దీనిని కూడా  కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఎంపీ లు, ఎమ్మెల్యేలతో ఆందోళనలు  చేయిస్తున్నారని వివరించారు.  ‘‘కాంగ్రెస్‌ లేకుండా కేసీఆ ర్‌ ఏ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తా రు? అసలు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్‌ విఫలయత్నమని కేసీఆర్‌కూ తెలుసు. అయినా ఆయన ఇంకేం చేస్తారో చూద్దాం’’ అని తరుణ్‌ఛుగ్‌ వ్యాఖ్యానించినట్లు వారు చెప్పారు.
మరోవంక,  భావ ప్రకటనా స్వేచ్ఛపేరుతో తెలంగాణ ఉద్యమకారులను, గిట్టని రాజకీయ పార్టీలను, పత్రికలు, ఛానెళ్లపై విషం చిమ్ముతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్‌ ఛానల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని  ప్రతినిధి బృందం కోరింది.
తన మాట వినని మీడియాపై కేసీఆర్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, బెదిరింపులతో కొన్ని మీడియా సంస్థలనుదారికి తెచ్చుకున్నారని పేర్కొం ది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలను ప్రసారం  చేశాయన్న ఆరోపణలపై ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో పాటు మరో ఛానల్‌ను గతంలో నిషేధించారని గుర్తుచేసింది.
కాగా, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే  పత్రికలకు లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ మంగళవారం నోటీసులు జారీచేసింది. 72 గంటల్లోగా లోక్‌సభ స్పీకర్‌కు వివరణ ఇవ్వాలని సూచించింది.  బీజేపీ కార్యకర్తలపై దాడులను సహించేదిలేదని బీజే పీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రభు త్వం అలీబాబా 40 దొంగల్లా తయారయిందని ఎద్దేవా చేశారు.
 
ఇలా ఉండగా,  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ వ్యతిరేక కా ర్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలపై వేటు వేయడానికి అధిష్ఠానం  రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది.  బండి సంజయ్‌ వెంట డీకే అరుణ, ఎంపీ  దర్మపురి అరవింద్‌,  ఈటల రాజేందర్‌, సీహెచ్‌ విఠల్‌, స్వామిగౌడ్‌,  జితేందర్‌ రెడ్డి,  ఎన్‌ రామచందర్‌ రావు, ఎన్‌వీవీఎ్‌స ప్రభాకర్‌, బంగారు శృతి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు.