పోలవరం పనుల వేగం పెంచాలి
పోలవరం ప్రాజెక్టు పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం బుధవారం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనులు, ఆర్ఆర్ ప్యాకేజీ, పునరావాసం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది.
మంగళవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జలవనరులశాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇఎన్సి నారాయణరెడ్డి, పోలవరం సిఇ సుధాకర్‌బాబు తదితరులు పాల్గన్నారు. ప్రాజెక్టులో కీలకమైన పునరావసం, ఆర్ఆర్ ప్యాకేజీ పనులపై కేంద్రం ఆరా తీసింది.
అలాగే దిగువ కాఫర్‌డ్యామ్, ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు గురించి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన