ఐరోపాను అతిపెద్ద ఘర్షణల్లోకి  లాగాలని రష్యా యత్నం 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ఘర్షణల్లోకి ఐరోపాను  లాగాలని రష్యా ప్రయత్నాలు చేస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. ‘‘రష్యా ప్లాన్.. 1945 తర్వాత ఐరోపాలో జరిగే అతిపెద్ద యుద్ధమని చెప్పడానికి నేను భయపడుతున్నా. యుద్ధానికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే మొదలైనట్లు మాకు సంకేతాలు వస్తున్నాయి. ఈ యుద్ధం జరిగితే చెల్లించుకోవాల్సిన మూల్యం గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని ఆయన హెచ్చరించారు. 

 ఆదివారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నుంచి బీబీసీ ఇంటర్వ్యూలో జాన్సన్ మాట్లాడితఁజి బెలారస్ నుంచి కూడా కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చుట్టుముట్టాలని రష్యా ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే అంతర్జాతీయంగా రష్యా ఆర్థిక కార్యకలాపాలను స్తంభింపజేస్తామని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. 

అంతకుముందు జర్మనీలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడిన జాన్సన్.. ఏదైనా దాడి జరిగితే అందుకు ప్రతిస్పందనగా పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలు రష్యాకు లండన్ మార్కెట్లను యాక్సెస్ చేసే వీలులేకుండా ఉంటాయని హెచ్చరించారు. రష్యన్ కంపెనీలు పౌండ్లు, డాలర్లలో ట్రేడ్ చేయకుండా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ ప్రతిఘటనకు పశ్చిమ దేశాలు మద్దతిస్తాయని చెప్పారు.

భారతీయులు వచ్చేయండి 
కాగా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భారత పౌరులు, విద్యార్థులు వెంటనే వెనక్కి రావాలని కేంద్రం కోరింది. అత్యవసరమైతే తప్ప అక్కడ ఉండొద్దని చెప్పింది. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఎంబసీ ఈమేరకు రెండో అడ్వైజరీ జారీ చేసింది. అందుబాటులోని విమానాలు పట్టుకుని భారత పౌరులు తాత్కాలికంగా ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. 

చార్టర్ ఫ్లైట్లపై అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ కోసం కాంట్రాక్టర్లతో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాలని, ఇండియన్ ఎంబసీ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ట్విట్టర్, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవ్వాలని చెప్పింది. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏదైనా సమాచారం, సాయం అవసరమైతే విదేశాంగ శాఖను కాంటాక్ట్ కావొచ్చని చెప్పింది. తమ పౌరులను ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడిచిపెట్టి వచ్చేయాలని జర్మనీ, ఆస్ట్రియా కూడా ఇప్పటికే ఆదేశాలిచ్చాయి.

ఇలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుతిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ ఫోన్ చేశారు. సమస్యను పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. చర్చలు జరపాల్సిన ప్రాంతాన్ని రష్యా ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. 

‘‘రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుదుకు ఏంకావాలో నాకు అర్థం కావడంలేదు. అందుకే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పాను” అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు. శాంతియుత పరిష్కారం కోసం దౌత్య మార్గాన్ని మాత్రమే ఉక్రెయిన్ అనుసరిస్తుందని తెలిపారు. అయితే క్రెమ్లిన్ నుండి వెంటనే ఎలాంటి స్పందన లేదు.