ఇది కల్వకుంట్ల తెలంగాణ మాత్రమే

ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కేవలం కల్వకుంట్ల తెలంగాణ మాత్రమే.. అంబేద్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనని ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు  జి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ పరిరక్షణపై బీజేపీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ దళితులకు హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు.

ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను బర్తరఫ్ చేశారని, అలాగే సీఎంవోలో ఒకే ఒక దళిత అధికారి ఉన్నారని ఆయన గుర్తు చేశారు.  కౌలు రైతులకు దళితు బంధు పథకం వర్తింపచేయమంటే ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ కి దళిత ఓట్లు మాత్రమే కావాలి, వారి సంక్షేమం అవసరం లేదని ఆయన ఆరోపించారు. 

అంబేద్కర్ దళితుడు కాబట్టే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటుండు.. మరింత అవినీతి చేయటానికి వీలుండేలా రాజ్యాంగాన్ని మార్చలన్నది కేసీఆర్ ఉద్దేశ్యం అని తెలిపారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు..ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణ ప్రాజెక్టులు బందీలయ్యాయని ఆరోపించారు. 

 అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల భూములన్నీ కేసీఆర్ కుటుంబంలో చేతిలో బందీ అయ్యాయని పేర్కొన్నారు. కమీషన్ల సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి  అని విమర్శించారు. ప్రజల డబ్బులతో రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్ నాటకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.

 కాగా, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, రూ. లక్ష కోట్లకు పైగా విలువైన పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిందని వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రా కాంట్రాక్టర్లను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని స్పష్టం చేశారు. 
 
రాష్ట్రం వస్తే ఇక్కడి వాళ్లకే కాంట్రాక్టులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు.  అందువల్ల ఏపీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన కాంట్రాక్టులను వెంటనే క్యాన్సిల్​ చేయాలని డిమాండ్​ చేశారు. లేదంటే ఇందుకోసం బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 
అవినీతి పాలన కారణంగా ప్రజల్లో కేసీఆర్ గ్రాఫ్​ పడిపోతున్నదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​ పార్టీకి ఓటమి తప్పదని వివేక్​ వెంకట స్వామి అన్నారు. నిజామాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఆర్​ఎస్​ ఎన్ని జిమ్మిక్కులు చేసినా హుజూరాబాద్​ ఎన్నికల్లో ఓడిపోయింది. దీన్ని పక్కదారి పట్టించేందుకే కేంద్ర రాజకీయాల్లోకి పోతా.. ప్రధాని అవుతా అని కేసీఆర్​ అంటున్నడు” అని విమర్శించారు.