పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు హాని అరెస్ట్ 

మరికొద్ది రోజుల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని మేనల్లుడు భూపేంద్ర సింగ్‌ హనీని కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది.
 
 ఇసుక అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల కింద హనీని గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తెలిపింది. శుక్రవారం ఉదయం సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. 
 
సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేశారు. గత నెల హనీ నివాసంపై సోదాలు జరిపిన ఇడి రూ. 8 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
 ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, మొబైల్‌ ఫోన్స్‌, రూ.21 లక్షల విలువైన నగదు, రూ.12 లక్షల రోలెక్స్‌వాచ్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఇడి ఒక ప్రకటనలో తెలిపింది.  పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 20న ఓటింగ్‌ జరగనుండగా, మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.