హుజురాబాద్ ఫలితాలతో కేసీఆర్ కు అభద్రతా భావం  

అంబేద్కర్ ను అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడటం దారుణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  హుజురాబాద్ ఫలితాల తర్వాత కేసీఆర్ కు అభద్రతా భావం కనిపిస్తోందని..అందుకే టీఆర్ ఎస్ నేతలు అసహనంతో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
 
బీజేపీ నాయకత్వంపై, కేంద్రంపై కేసీఆర్‌ అడ్డగోలు భాషను ప్రయోగించారని ఆరోపించారు. పాకిస్థాన్‌ ప్రధాని కూడా మోదీని ఎన్నడూ ఇలా విమర్శించలేదని, సీఎం కేసీఆర్‌ మాటలు వింటే బాధేస్తోందని విచారం వ్యక్తం చేశారు.  తెలంగాణలో మనం ఉన్నా,  లేకపోయినా (బీజేపీ,టీఆర్‌ఎస్,పార్టీలు) తెలంగాణ శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించకండని, అది మంచిది కాదని కేసీఆర్‌కు ఆయన హితవు పలికారు. 
 
ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ మీ  కుటుంబ సొత్తు కాదని, దానిపై అందరికి హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్రంలో సచివాలయం లేదని, సచివాలయానికి సీఎం రారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలని, మంత్రులను సీఎం కలవరని చెబుతూ  రాజ్యాంగానికి మీరు  ఏమైనా అతీతమైన శక్తా అని ఆయన  ప్రశ్నించారు. 
 
బీజేపీని విమర్శించే ముందు ఆయన ఇచ్చిన హామీలను ఎంతమేరకు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు ఏమిచ్చారని సీఎం అడుగుతున్నారని, అంటే ప్రగతి భవన్‌కు నేరుగా చెక్కు ఇవ్వాలా అని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మద్యం తెలంగాణగా మార్చారని ఆరోపించారు. 
 
‘‘7 ఏళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు లేవు. రాష్ట్రానికి సచివాలయం లేదు. ఉన్నప్పుడు సీఎం సచివాలయానికి రాలేదు. ప్రజలను, మంత్రులను కలవరు. మీరేమైనా రాజ్యాంగానికి అతీతులా?’’ అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్‌ కుటుంబ సొత్తు కాదని, అందరికీ హక్కు ఉందని స్పష్టం చేశారు. 
తెలంగాణ కోసం అమరవీరులు చనిపోతే వారికి న్యాయం కూడా చేయలేకపోయారని  బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మద్యం తెలంగాణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.
పుత్ర మమకారం, కుటుంబ మమకారం కోసం కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  తెలంగాణ కోసం అమరవీరులు చనిపోతే వారికి న్యాయం కూడా చేయలేకపోయారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మద్యం తెలంగాణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏడు ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేవని గుర్తు చేశారు.
 
 దేశమంతా తిరిగి విప్లవం తీసుకొని రండని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆ హక్కును మీకు రాజ్యాంగం హక్కు కలిపించిందని, మీకు స్వేచ్ఛగా తిరిగే అధికారం ఉందని ఆయన అన్నారు.
 
ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి  ధ్వజమెత్తుతూ ఆయన టక్కు టమారా మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చెబుతున్న అబద్ధాలు నిజం కావని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.