మహాత్మా గాంధీకి నిజమైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్!

* 74వ వర్ధంతి 
మహాత్మా గాంధీగా ప్రసిద్ధి చెందిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గాంధీ వారసత్వానికి నిజమైన వారసునిగా స్పష్టంగా ఉద్భవించింది.
మహాత్మా గాంధీ దృఢమైన హిందువు అని పేర్కొంటూ హిందుత్వం, గోసంరక్షణ, స్వదేశీ, అంటరానితనం నిర్మూలనపై ఆయన ఆలోచనలను ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు తీసుకువెడుతున్నది. 

నిజానికి మహాత్మా గాంధీ సంఘ్ గొప్ప ఆరాధకులలో ఒకరు. 1934లో, గాంధీ మహారాష్ట్రలోని వార్ధాలో ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించారు.  అన్ని కులాలకు చెందిన యువకులు,  బాలురు తోటి స్వయంసేవకుల కులాల వారితో ఇబ్బంది పడకుండా ఒకే చోట ఉంటూ, కలసి  భోజనం చేయడం ఆయనను ఆకట్టుకుంది.
స్వాతంత్య్రం వచ్చిన ఒక నెల తర్వాత, సెప్టెంబర్ 16, 1947 న, ఢిల్లీలో తన ప్రసంగాలలో ఒక సమయంలోఆర్‌ఎస్‌ఎస్  కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గాంధీజీ  “సంవత్సరాల క్రితం, వ్యవస్థాపకుడు శ్రీ (కెబి) హెడ్గేవార్ జీవించి ఉన్నప్పుడు నేను  ఆర్‌ఎస్‌ఎస్   శిబిరాన్ని సందర్శించాను. మీ క్రమశిక్షణ, అంటరానితనం పూర్తిగా లేకపోవడం, కఠినమైన సరళత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి” అని చెప్పారు.“అప్పటి నుండి, సంఘ్ పెరిగింది. సేవ,  స్వయం త్యాగం ఉన్నత ఆదర్శంతో ప్రేరణ పొందిన ఏ సంస్థ అయినా బలాన్ని పెంచుతుందని నేను నమ్ముతున్నాను” అంటూ తెలిపారు.యాదృచ్ఛికంగా, మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సూత్రాలను పొందుపరిచిన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కూడా 1939లో పూణేలోని సంఘ్ శిక్షా వర్గాన్ని (ఆర్‌ఎస్‌ఎస్   శిక్షణా శిబిరం) సందర్శించారు. డాక్టర్ అంబేద్కర్  ఆర్‌ఎస్‌ఎస్   వ్యవస్థాపకుడు డాక్టర్ .కె బి  హెడ్గేవార్ ను, శిబిరంలో ఎవరైనా అంటరానివారు ఉన్నారా? అని అడిగారు. 

ఇక్కడ తాకదగినవారు లేదా అంటరానివారు ఎవరూ లేరని, హిందువులు మాత్రమే ఉన్నారని డాక్టర్జీ బదులిచ్చారు.  “ఇతరుల కులాన్ని కూడా పట్టించుకోకుండా సంపూర్ణ సమానత్వం, సోదరభావంతో స్వయంసేవకులు తిరుగుతున్నందుకు నేను ఆశ్చర్యపోయాను” అని అంబేద్కర్ పేర్కొన్నారు.

గాంధీ – ఉపాధ్యాయ 

ప్రఖ్యాత రచయిత,  ప్రస్తుతం జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు అధిపతిగా ఉన్న డాక్టర్ వాల్టర్ ఆండర్సన్, ఆర్‌ఎస్‌ఎస్ పై అనేక ప్రశంసలు పొందిన రచనలను చేశారు. ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ (దీనదయాళ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించినది) అనే సంకలనంలో ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశారు.
గాంధీజీని సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయతో పోల్చారు. భారతీయ జనతా పార్టీ  పూర్వ అవతారమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఉపాధ్యాయ ఒకరు. “ఏకాత్మతా మానవతా వాదం” అనేది అధికార బిజెపి అధికారిక భావజాలం.

1992లో ప్రచురితమైన గాంధీ అండ్ దీనదయాళ్: టూ సీర్స్ అనే వ్యాసంలో, అండర్సన్ గాంధీ,  ఉపాధ్యాయ మధ్య పోలికను చూపారు. వారిద్దరి మధ్య  చాలా సాధారణ విషయాలను కనుగొన్నారు.
“గాంధీ,  ఉపాధ్యాయ ప్రాథమికంగా సంఘటనకర్తలు.   ద్వితీయంగా వారు  తాత్విక ఆలోచనలపై ఆసక్తి కలిగి ఉన్నారు… ఇద్దరూ ఆకర్షణీయమైన వ్యక్తులు,” అని అండర్సన్ రాశాడు. “గాంధీ భారత జాతీయ కాంగ్రెస్‌ను మార్చారు… ‘మహాత్మా’గా ఆయన ఆకర్షణీయమైన విజ్ఞప్తి కాంగ్రెస్‌ను స్వాతంత్య్ర ఉద్యమంలో  ప్రభావవంతమైన పాత్ర వహించేటట్లు చేసింది… ఉపాధ్యాయ కూడా సాధువు తరహా పాత్ర కలిగి ఉన్నాడు… జనసంఘ్ కేడర్‌పై కూడాఆయన  అదే ప్రభావాన్ని కలిగించారు. ”గాంధీ,  ఉపాధ్యాయ ఇద్దరూ అధికారంలో ప్రత్యక్ష భాగస్వామ్యానికి దూరంగా ఉన్నారు.  పదునైన ఆలోచనలు గలవారే కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన  మేధావులు. వారి సైద్ధాంతిక ఫ్రేమ్‌వర్క్‌లు వారి క్షేత్రస్థాయి  అనుభవాల నుండి ఉద్భవించాయి.”వాస్తవానికి (గాంధీ,  ఉపాధ్యాయ) ఈ పదం యొక్క సాంప్రదాయిక అర్థంలో మేధావులు కాదు.  అది విద్యాపరమైన అర్హతలు,  వారి వ్రాసిన  పుస్తకాల  సుదీర్ఘ జాబితాలతో కూడిన వివేకవంతులు.  అధునాతన పురుషులు” అని అండర్సన్ రాశాడు.

అంతులేని పోలికల జాబితా

పోలిక ఇక్కడితో ముగియదు. గాంధీ ‘స్వరాజ్‌’,  ‘స్వదేశీ’లకు అత్యంత మద్దతుదారుడు. ఉపాధ్యాయ ‘ఏకాత్మ మానవతావాదం’  గురించి మాట్లాడేటప్పుడు అటువంటి తత్వాలనే ప్రస్తావించారు.  నిజానికి, అభివృద్ధిలో   పాశ్చాత్య నమూనాల తిరస్కరణ గాంధీ,  ఉపాధ్యాయల ఇద్దరి  ఆలోచనా విధానంలకు  ఆధారంగా ఉంది.

“చివరిగా ఇద్దరూ రాజకీయ అధికారం ప్రజారంగంలోని  వ్యక్తులపై అవినీతి ప్రభావాన్ని చూపుతుందని అనుమానించారు. వారిద్దరూ ఏ రాజకీయ పదవిని నిర్వహించలేదు. అలా చేయాలని కోరుకోలేదు” అని అండర్సన్ రాశాడు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే గాంధీ తన సన్నిహిత సహోద్యోగులతో మాట్లాడుతూ, “అధికారాన్ని వదులుకోవడం ద్వారా, ఓటర్ల స్వచ్ఛమైన, నిస్వార్థ సేవకు మనల్ని మనం అంకితం చేసుకోవడం  ద్వారా, మనం  వారికి మార్గనిర్దేశం చేయవచ్చు,  ప్రభావితం చేయవచ్చు” అని చెప్పారని అండర్సన్ తెలిపారు.

“ప్రభుత్వంలోకి వెళ్లడం ద్వారా మనకు లభించే దానికంటే ఇది చాలా ఎక్కువ నిజమైన శక్తిని ఇస్తుంది…నేడు రాజకీయాలు అవినీతిమయంగా మారాయి. అందులోకి వెళితే ఎవరైనా కలుషితమే. మనం దాని నుండి పూర్తిగా దూరంగా ఉందాం. తద్వారా మన ప్రభావం పెరుగుతుంది” (డి జి . టెండూల్కర్, మహాత్మా, సంపుటి 8, పేజీలు 278-280) అని గాంధీ పేర్కొన్నారు.

అండర్సన్ ఇంకా ఇలా అన్నాడు, “ఆయన  సలహాను ఆయన  కాంగ్రెస్ సహచరులు చాలా మంది తిరస్కరించారు. హాస్యాస్పదంగా ఓ రాజకీయ పార్టీ నాయకుడైన ఉపాధ్యాయ, బహుశా రాజకీయాల పట్ల గాంధీజీ  అభిప్రాయానికి మద్దతు పలిదారు”

ఉపాధ్యాయ ఇలా వ్రాశారు, “నేడు రాజకీయాలు ఒక సాధనంగా నిలిచిపోయాయి. అది అంతంతమాత్రంగానే మారింది. కొన్ని సామాజిక, జాతీయ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో రాజకీయ అధికారమే లక్ష్యంగా కాకుండా అధికార రాజకీయాలలో నిమగ్నమైన వ్యక్తులు నేడు మనకు ఉన్నారు (పొలిటికల్ డైరీ, పేజీ-115)…”

 
సమాజంలో స్త్రీ పురుషుల వ్యక్తిత్వమే  అంతిమంగా రాజ్య స్వభావాన్ని నిర్ణయిస్తుందని గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు.  అలాంటి స్త్రీ పురుషులను తయారు చేసే పనిని గత 93 సంవత్సరాలుగా దేశంలో ఒక సంస్థగా తాము  నిర్విరామంగా చేస్తున్నట్లు  ఆర్ఎస్ఎస్   భావిస్తోంది.
 
కాబట్టి మహాత్ముని వారసత్వానికి నిజమైన వారసులు ఆర్‌ఎస్‌ఎస్, దాని సిద్ధాంతాలు;  సిద్ధాంతకర్తలు,  నిర్వాహకులు, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి నిస్వార్థ దేశభక్తులు అని స్పష్టమవుతుంది.