అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాటలోనే ప్రశ్నలు అడిగిన జర్నలిస్టుల పట్ల ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ సహితం అసహనంతో వ్యవహరిస్తున్నారు. ఒక జర్నలిస్ట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ద్రవ్యోల్బణం గురించి ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డారు. వైట్ హౌస్‌లో ప్రత్యక్ష ప్రసారం ముగిసిన అనంతరం మీడియా సభ్యులు బయటికి వస్తుండగా ఫాక్స్‌న్యూస్ జర్నలిస్ట్ ‘ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యత కాదా’ అని అధ్యక్షుడిని ప్రశ్నించారు.
దీంతో బైడెన్ మైక్ ఆన్‌లో ఉండగానే అది గొప్ప ఆస్తి అంటూ.. ఆ జర్నలిస్ట్‌ని ‘యూ స్టుపిడ్ ….” అంటూ ఆ తర్వాత ఒక బూతు పదం వాడారు. పక్కనే ఉన్న మీడియా సభ్యులు బైడెన్ ప్రవర్తనతో నిర్ఘాంత పోయారు. అయితే బైడెన్ ఏం అన్నారో అర్థం కాలేదని ఆ జర్నలిస్ట్ పీటర్ డూకీ పేర్కొన్నారు.
అనంతరం డూకీని పిలిచి వ్యక్తిగతంగా తీసుకోవద్దని బైడెన్ సూచించారు. ఫాక్స్ న్యూస్ కన్జర్వేటివ్స్‌కి అనుకూలంగా ఉండే మీడియా కావడంతో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

More Stories
బంగ్లాదేశ్ లో మరో హిందూ దారుణ హత్య
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఉన్నత విద్యావంతుడే!
ట్రంప్‌పై కరస్పాండెంట్స్ డిన్నర్లో హత్యాయత్నం