ఢిల్లీలో తప్పిన భారీ ఉగ్రకుట్ర… పేలుడు  పదార్ధం స్వాధీనం

తూర్పు ఢిల్లీలోని ఒక ప్రముఖ ఫ్లవర్‌ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 3 కిలోల పేలుడు పద్ధారాలతో నిండిన ఒక బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,  నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో  బ్యాగ్‌ స్కాన్‌ చేసి పరిశీలించారు.

బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు.

నేషనల్‌ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్‌ మండీ మార్కెట్‌ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది.

కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్‌ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్‌ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అ‍ప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్‌ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది.

ఈ బాంబ్‌తో భారీ ఉగ్రవాద నష్టం జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దేశ రాజధానికి పెద్ద ముప్పు తప్పిన్నట్లయినదని భావిస్తున్నారు. అందులో ఆర్ డి ఎక్స్ ఉండడంతో భారీ పేలుడు కోసం కుట్రపన్ని ఉంటారని భావిస్తున్నారు. 

దీనిని ఈ నెల 26 రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ముందు ఒక తీవ్రవాద ప్రయత్నంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 9:30 గంటల ప్రాంతాలో మార్కెట్‌కు పూలు కొనేందుకు స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి బ్యాగ్‌ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు.

దానితో ఎన్ఐఎ రంగంలోకి దిగి దానిని ఎవ్వరు అమర్చి ఉంటారనే దర్యాప్తు ప్రారంభించారు. ఒక వ్యక్తి పూలుకొనే వానికే ఒక స్కూటర్ పై వచ్చి ఉదయమే అక్కడ వదిలి వెళ్లిన్నట్లు సిసి కెమెరాలతో కనుగొన్నారు.