సంక్రాంతికి ప్రపంచ సూర్య నమస్కార ప్రదర్శన

ఆయుష్ మంత్రిత్వ శాఖ జనవరి 14, మకర సంక్రాంతి రోజున 75 లక్షల మందితో  ప్రపంచ సూర్య నమస్కార ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ రోజున, సూర్యునికి నమస్కరిస్తూ, దానిలోని ప్రతి కిరణానికి ఒకరి కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఇది అన్ని జీవులను పోషిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

భూమిపై కిరణాలు వెదజల్లుతూ జీవులకు రక్షణ కల్పిస్తున్నందుకు సూర్యునికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంగా ఆయుష్‌శాఖ అభివర్ణించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన వేళ సూర్య నమస్కారాల ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందని గుర్తు చేసింది. 
 

శాస్త్రీయంగా, సూర్య నమస్కార్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి, జీవశక్తిని మెరుగుపరుస్తుందని ప్రసిద్ది చెందింది. ఇది మహమ్మారి పరిస్థితులలో ఆరోగ్యానికి ముఖ్యమైనది. సూర్యరశ్మి తగలడంతో  మానవ శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. దీనిని  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానాలలో విస్తృతంగా సిఫార్సు చేస్తున్నారు.

సామూహిక సూర్య నమస్కార్ ప్రదర్శన ద్వారా వాతావరణ మార్పు,  గ్లోబల్ వార్మింగ్ సందేశాన్ని తీసుకువెళ్లాలని కూడా ఉద్దేశించిన్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.  వాతావరణ స్పృహ తప్పనిసరి అయిన నేటి ప్రపంచంలో, రోజువారీ జీవితంలో సౌర ఇ-శక్తి (గ్రీన్ ఎనర్జీ) అమలు చేయడం వల్ల గ్రహానికి ముప్పు కలిగించే కార్బన్ ఉద్గారాలను బాగా తగ్గిస్తుంది.

పైగా, ఈ కార్యక్రమం మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో మకర సంక్రాంతి ప్రాముఖ్యతను వెల్లడి చేస్తుంది. సూర్య నమస్కార్ అనేది శరీరం, మనస్సు సమన్వయంతో 12 దశల్లో ప్రదర్శించబడే ఎనిమిది ‘ఆసనాల’ సమితి. దీనిని ముఖ్యంగా  తెల్లవారుజామున చేస్తారు.