వీర్ బాల దివస్ గా డిసెంబర్ 26

సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ జీ , సాహిబ్‌జాదా ఫతే సింగ్ జీ. ల అమరత్వంకు గుర్తుగా ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 26ని ‘వీర్ బాల్ దివస్’గా పాటిస్తున్నట్లు శ్రీ గురుగోవింద్ సింగ్ జీ  ప్రకాష్ పురబ్ శుభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటించారు.

వరుస ట్వీట్లలో, ప్రధాన మంత్రి ఇలా అన్నారు: “ఈ రోజు, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ  ప్రకాష్ పూరబ్ శుభ సందర్భంగా, ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 26వ తేదీని ‘వీర్ బాల్ దివస్‌గా జరుపుకోగలమని తెలపడం నాకు గర్వకారణంగా ఉంది. ‘ సాహిబ్జాదేస్  ధైర్యానికి,  న్యాయం కోసం వారి తపనకు ఇది సముచితమైన నివాళి.

సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ జీ,  సాహిబ్జాదా ఫతే సింగ్ జీ సజీవంగా గోడలో బంధించిన తర్వాత వీరమరణం పొందిన అదే రోజున వీర్ బాల్ దివస్ ఉంటుంది. ఈ ఇద్దరు మహానుభావులు ధర్మం  ఉదాత్తమైన సూత్రాల నుండి వైదొలగడానికి బదులు మరణానికి ప్రాధాన్యత ఇచ్చారు.

మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, 4 సాహిబ్జాదేస్ శౌర్యం, ఆదర్శాలు కోట్లాది మంది ప్రజలకు బలాన్ని ఇస్తాయి. వారు అన్యాయానికి ఎన్నడూ తలవంచలేదు. వారు సమ్మిళిత,   సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని ఊహించారు. వారి గురించి మరింత మంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.”

శ్రీ గురుగోవింద్ సింగ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఒక ట్వీట్‌లో, ప్రధాని ఇలా అన్నారు;

“శ్రీ గురు గోవింద్ సింగ్ జీ  ప్రకాష్ పురబ్‌కు శుభాకాంక్షలు. ఆయన జీవితం, సందేశం లక్షలాది ప్రజలకు బలాన్ని ఇస్తుంది. ఆయన 350వ ప్రకాష్ ఉత్సవ్‌ను జరుపుకునే అవకాశం మన ప్రభుత్వానికి లభించిందనే వాస్తవాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.  సమయంలో పాట్నాలో నా పర్యటన నుండి కొన్ని సంగ్రహావలోకనాలను పంచుకుంటాను.