కరొనపై కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు జారీ 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకి మైండ్ సిస్టంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
 ”కరోనా సోకిన వ్యక్తి మూడు రోజుల వరకు జ్వరము లేదా జలుబు, దగ్గు లేకుంటే ఏడు రోజులు ఐసోలేషన్ లో ఉండాలి. కరోనా సోకిన బాధితులు తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలి అదికూడా త్రిబుల్ లేయర్ మాస్కూల్ ధరించాలి” అని సూచించింది. 
 
ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు వెంటిలేషన్ బాగా ఉన్నా రూమ్ లో ఉండాలని, ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలని, కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలని చెప్పింది. 
 
కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌-95 మాస్క్‌ను ఉపయోగించాలి. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్‌ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలని వివరించింది. 
 
జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. 
తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది.  బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలి. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదని కేంద్రం సూచనలు చేసింది.
కాగా, భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 90928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 56.6శాతం పెరిగింది. ఇక మరో 324 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 19206 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ కూడా దేశ ప్రజల్ని వణికిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 285401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు  4,82,876 మంది చనిపోయారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు 148.67 కోట్ల టీకా డోసుల పంపిణీ  పూర్తయ్యింది.