బండి సంజయ్ విడుదలకు హైకోర్టు ఆదేశం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది.  వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని  రిమాండ్ రిపోర్టు ఇవ్వడం సరికాదని స్పష్టం చేస్తూ, దానిని హైకోర్టు. కొట్టివేసింది.

సంజయ్ ను రూ.40,000 పర్సనల్ బాండ్ పైన విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని,అరగంటలో కేసు, అరెస్ట్ , రిమాండ్ చేయడంలో మీ ప్రత్యేక శ్రద్ధ ఏంటని పోలీసులను ప్రశ్నించింది.  పోలీసులు పెట్టిన 333 సెక్షన్ అక్రమమని, ఎఫ్​ఐఆర్ లో నుండి ఆ సెక్షన్ తొలగించాలని పేర్కొంటూ చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపజేయాలని ఆదేశించింది.

.బండి సంజయ్ ను విడుదల  చేయాలని జైళ్లశాఖ డీజీకి  హైకోర్టు ఆదేశమిచ్చింది. రెండు విషయాలలో పోలీసుల తీరును  న్యాయస్థానం తప్పబట్టింది.  పోలీస్ అధికారి అరెస్టుకు ముందు, తర్వాత దాఖలైన  ఎఫ్ఐఆర్ ను ప్రస్తావిస్తూ  రాత్రి 10:50 గంటలకు,  ఆ తర్వాత రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ఎఫ్ఐఆర్ సరైంది కాదని భావించింది.

బండి సంజయ్ కుడిచేయి వేలికి గాయమైందని చెప్పి ఎఫ్ఐఆర్ లో  సెక్షన్ 333 అదనంగా చేర్చారని, కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం ఇంకా మెడికల్ రిపోర్ట్ అందాల్సి ఉందని పోలీసులు చెప్పారని కోర్టు  తెలిపింది.  కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే 17 వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైంది కాదని అభిప్రాయపడింది.

ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 7 కు వాయిదా వేసింది. ఉద్యోగ,ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో రద్దు చేయాలని  ఈ నెల 2న కరీంనగర్ లో జాగరణ దీక్షకు దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.   కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరు పర్చగా  బండి సంజయ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

తరుణ్ చుగ్ ఆగ్రహం 
 
బండి సంజయ్ పై  పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ స్టర్ దావుద్ ఇబ్రహీంతో వ్యవహరించినట్లుగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డాయిరు. పోలీసులు టీఆర్ఎస్ జెండా మోస్తూ, ప్రశ్నించిన వారిపై  అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వారు  వారు  ఖాకీ డ్రెస్ విడిచి పింక్ డ్రెస్ వేసుకోవాలని ఎద్దేవా చేశారు.

అబద్దపు కేసులతో  బండి సంజయ్ ని కేసీఆర్ ప్రభుత్వం జైల్లో పెట్టిస్తే,  కోర్టు న్యాయం చేస్తూ.. ఆయన్ను కోర్టు విడుదల చేసిందని పేర్కొన్నారు. రాష్త్ర ప్రభుత్వం తప్పు చేసిందని హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైందని ఆయన తెలిపారు. బ్రిటిష్ పాలకుల్లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. అప్రజాస్వామిక ప్రభుత్వంపై పోరాటం చేస్తునే ఉంటామనిత రుణ్ చుగ్ స్పష్టం చేశారు.