భారతీయులకు వీసా రుసుం తగ్గించిన యుకె 

భారతీయ ప్రయాణికులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసేందుకు బ్రిటన్‌ వసలదారుల చట్టంలో కొన్ని నిబంధనలను సడలించనుంది. దీనిలో భాగంగా భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వృత్తి  నిపుణులకు వీసాలు తక్కువ రుసుముతో జారీ చేయనుంది. 
 
భారత్‌ను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)లో భాగంగా ఈ ప్రతిపాదలు చేయనున్నట్లు స్థానిక పత్రిక పేర్కొంది. ఈ ఎఫ్‌టిఎపై చర్చలు జరిపేందుకు బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి ఆన్‌ మేరీ ట్రెవిల్యాన్‌ ఈ నెలలో ఢిల్లీ చేరుకోకున్నారు. 
 
మేరీ ట్రెవిల్యాన్‌తో పాటు ఢిల్లీకి చేరుకోనున్న బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి లిజ్‌ ట్రస్‌ కూడా భారత్‌తో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. తమ పౌరులపై విధిస్తున్న పలు వలస నిబంధనలను సడలించాలన్న భారత డిమాండ్‌ను ఈ సందర్భంగా బ్రిటన్‌ ఆమోదించవచ్చని ఆ పత్రికలో పేర్కొంది. 
 
పస్తుతం బ్రిటన్‌కు వెళ్లే భారతీయ పౌరుల నుండి వర్క్‌ వీసా అయితే రూ.1.40 లక్షలకు పైగా (1400 పౌండ్లు), విద్యార్థుల వీసా కోసం రూ.35 వేలకు పైగా (348 పౌండ్లు), టూరిస్టు వీసాకు రూ.9500కు పైగా (95 పౌండ్లు) రుసుములను వసూలు చేస్తున్నారు. పర్యాటక వీసాలకు కూడా ఈ తగ్గింపు వుండవచ్చని తెలిపింది.