సాగు చట్టాలను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు 

సాగు చట్టాలను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు 
మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. 
 
గత  నెల 19న ఈ చట్టాలను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం, ఆ తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటిరోజుననే ఆ మేరకు బిల్లును ఆమోదించడం తెలిసిందే. వెంటనే సంవత్సరంకుపైగా ఢిల్లీ శివారులలో ఆందోళనలు చేస్తున్న రైతులు తమ ఆందోళనలను  విరమించి, ఇళ్లకు తిరిగి వెళ్లారు.

“వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. రైతుల గౌరవార్థం వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ అపోహను ప్రచారం చేస్తోంది” అంటూ తోమర్ ధ్వజమెత్తారు. 

 
తాను ఈ విషయమై మాట్లాడిన మాటలు మీడియాలో పొరపాటుగా ప్రచురితం కావడం, వెంటనే ప్రతిపక్షాలు వక్రభాష్యాలు చెబుతూ ఉండడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

నాగ్‌పూర్‌లోని ఆగ్రో-విజన్‌లో తన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తోమర్ ఇలా అన్నాడురు’: “మేరే కహ్నే కా ఆశ యహ్ బిలాకుల్ నహీం థా జో దిఖాయా జా రహా హై. మైనే యే కహా థా కి కృషి సుధార్ కానూన్ కే దృష్టి సే హామ్ పీఛే హేతే హై లేకిన్ కిసాన్ కే భలాయీ కే లీ లగతార్ భారత్ సర్కార్ ఆగే బాధ్తీ రహేగీ… కృషి సుధార్ కానూన్ దుబారా సే లానే కా. 

 
“మేము వ్యవసాయ సంస్కరణల చట్టాలపై వెనక్కి తగ్గామని నేను చెప్పాను. అయితే రైతుల అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం ముందుకు సాగుతుంది… వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు” అని తాను స్పష్టంగా పేర్కొన్నా ఆ విధమైన కధనాలు వెలువడటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

”రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల చట్టాలను తీసుకొచ్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా రైతుల ఆందోళనకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం,  ప్రధానమంత్రి పెద్ద మనసుతో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు” అని తోమర్ తెలిపారు.

గత ఏడున్నరేళ్లలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక “చారిత్రక చర్యలు” చేపట్టిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.