మతమార్పిడి క్రైస్తవ సంస్థలపై కొరడా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మతమార్పిడికి పాల్పడుతున్న 18 క్రైస్తవ సంస్థల మతమార్పిడికి కార్యకలాపాలపై సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు అందాయని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయి మంగళవారం లోక్ సభలో తెలిపారు. రాష్ట్రంలో మతమార్పిడులకు పాల్పడుతున్న సంస్థలపై వచ్చిన ఫిర్యాదులు, వాటి ప్రస్తుత స్థితిపై నరసాపురం లోక్ సభ సభ్యులు కనుమూరి రఘు రామకృష్ణరాజు సమర్పించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి, ఆ సంస్థలన్నిటి ఆడిట్ రిపోర్టులు, ఇతర సాక్ష్యాధారాలు పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లకు పాల్పడుతున్న సంస్థలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చాలా కాలంగా కేంద్ర హోంశాఖకు నివేదికలు సమర్పిస్తోంది. వీటిలో విదేశీ విరాళాలు పొందుతున్న సంస్థలే అధికంగా ఉండటంతో ఇదే అంశాన్ని లోక్సభలో కేంద్ర మంత్రి ప్రస్తావించడం గమనార్హం. మంత్రి ప్రస్తావించిన 18 సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

1. మెట్రోపాలిటన్ మిషన్
2. స్వాంతన సేవా సమితి
3. ఒకినొమస్ మినిస్ట్రీస్
4. బిక్కవోలు ఛారిటబుల్ ట్రస్ట్
5. హెరాల్డ్ ఆఫ్ గుడ్ న్యూస్ సొసైటీ
6. ఇండియా రూరల్ ఎవాంజెలికల్ ఫెలోషిప్
7. లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్
8. లైఫ్ గివర్స్
9. సలేసియాన్ ఆంధ్రా సొసైటీ
10. లవ్-అండ్-కేర్ మినిస్ట్రీస్
11. ఇండియన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్
12. డియోసిస్ ఆఫ్ నెల్లూరు సొసైటీ
13. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్
14. షాలోమ్ ట్రస్ట్ ఫర్ రిలీఫ్, ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీస్
15. గుడ్ షెఫర్డ్ కాన్వెంట్
16. సమంత కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ
17. హార్వెస్ట్ ఇండియా
18. సైలోమ్ బ్లైండ్ సెంటర్