మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ అరెస్ట్‌కు యత్నం!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో విచారణను  ముమ్మరం చేసిన ఏపీ సీఐడీ పోలీసులు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ను అరెస్ట్‌కు యత్నించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. రమేష్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. 

ఒక కంపెనీ‌కి రూ.350 కోట్లు విడుదల చేయడం వెనుక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణంలో విచారించనున్నారు.  అప్పట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి‌గా రమేష్ పని చేశారు. ఒకవేళ ఈ కేసు‌లో రమేష్‌ను సాక్షి‌గా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన పత్రాలను రిజిస్టర్‌ పోస్టులో పంపించాలని నిర్ణయించినట్లు సిఐడి పేర్కొంది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా సీమెన్స్‌కు విడుదల చేసిన 241 కోట్ల రూపాయల నిధుల్లో అవకతవకలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో సీమెన్స్‌ ఎరడి సౌమ్యాద్రి శేఖర్‌, డిజైన్‌ టెక్‌ ఎరడి వికాశ్‌లకు ఈ నిధులు 2015 జూన్‌లో దురుద్దేశపూర్వకంగా కేటాయించారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని గతంలోనే అరెస్ట్‌ చేయగా, ఇటీవల గంటా సుబ్బారావు ను అరెస్ట్‌ చేసింది.

ఇప్పుడు అదే కేసులో అప్పటి ఆర్ధికశాఖ కార్యదర్శి పివి రమేష్‌ను కూడా విచారించెందుకు ఆయన ఇరటికి పోలీసులు వెళ్లడం చర్చనీయారశంగా మారిరది. స్కిల్‌ డెవలప్‌మెరట్‌ సంస్థతో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ అప్పట్లో (2014 జూన్‌ నురచి 2016 వరకు) ఆర్ధిక శాఖ కార్యదర్శిగా ఉండడం, నిధుల వ్యవహారాలను ఆయనే చూడడం వల్ల ఆయనను విచారించెందుకు వెళ్లినట్లు తెలిసింది.

గతంలోనే పార్లమెంట్‌ సభ్యుడు రఘురామ కృష్ణరాజును సిఐడి అరెస్ట్‌ చేసిన సమయంలో కూడా ఆయన సెల్‌ నుంచి తనకు సంక్షిప్త సమాచారం వచ్చినట్లు రమేష్‌ ప్రకటించడం, ఆ ఫోన్‌ తన వద్ద లేదని, సిఐడి వద్దనే ఉందని రఘురామ వెల్లడించడంతో అప్పట్లో సిఐడి ఇరుకున పడినట్లు వార్తలు వచ్చాయి.

మరోవంక,  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రేమ్‌చంద్రారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిధులు విడుదల చేసిన వారికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రేమ్‌చంద్రారెడ్డికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ దర్యాప్తు అధికారి నోటీసులు జారీ చేశారు. 

సీర్‌పీసీలోని సెక్షన్‌ 91, 160 కింద  తమకు సమాచారం ఇవ్వాలని పలు ప్రశ్నలను సంధిస్తూ ఏడు పేజీలు నోటీసు ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీలు నిధుల విడుదలలో వారి పాత్ర ఏమిటని సీఐడి అధికారులు ప్రశ్నించారు. ప్రేమ్‌చంద్రారెడ్డికి సాక్షిగా సీఐడి నోటీసులు జారీ చేసింది.

 డాక్యుమెంట్లు ఉంటే తమకు అందచేయాలని ఆదేశించింది. మొత్తం 37 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీస్సులో సీఐడి అధికారులు పేర్కొన్నారు.