కేరళలో బిజెపి, ఎస్‌డిపిఐ నేతల హత్యలతో ఉద్రిక్తత

సిపిఎం పాలనలో ఉన్న కేరళలో మరోసారి హత్యా రాజకీయాలు భగ్గుమని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఆదివారం తెల్లవారుజామున అలప్పుజా జిల్లాలో ఒక బిజెపి రాష్ట్ర నాయకుడిని నరికి చంపగా, అదే జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు కొన్ని గంటల ముందు హత్యకు గురయ్యాడు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది రంజిత్ శ్రీనివాస్‌పై అలప్పుజా నగరంలో తెల్లవారుజామున ఆయన ఇంటిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం పూట నడకకు  సిద్ధమవుతుండగా ఓ ముఠా ఇంట్లోకి చొరబడి పలుమార్లు నరికి చంపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంజిత్ పోటీ చేశారు.

ఎస్‌డిపిఐ రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌షాన్‌పై కూడా శనివారం రాత్రి ఓ ముఠా దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దుండగులు వాహనం దిగి షాన్‌ను పలుమార్లు నరికి చంపారు. అతన్ని వెంటనే అలప్పుజాలోని స్థానిక ఆసుపత్రికి, తరువాత కొచ్చి ఆసుపత్రికి తరలించగా, అర్ధరాత్రి మరణించాడు.

అలప్పుజలో జరిగిన హత్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. “దాడి చేసిన వారితో పాటు హేయమైన హత్యల వెనుక పనిచేసిన వారిని పట్టుకోవడానికి కఠినమైన పోలీసు చర్యలు ఉంటాయి. ఇలాంటి నేరపూరిత చర్యలు సమాజానికి చేటు చేస్తాయి. ప్రజలు నేరస్థులను, వారి ద్వేషపూరిత వైఖరిని వేరు చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ”అని విజయన్ పేర్కొన్నారు.

ఈ హత్యలకు సంబంధం ఉందా?   ప్రతీకార స్వభావం ఉందా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు అలప్పుజా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి జైదేవ్ తెలిపారు.

“హత్యలకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌డిపిఐ నాయకుడి  హత్య తర్వాత పరిస్థితిని పర్యవేక్షించడానికి పోలీసులు ఎటువంటి అలసత్వం వహించలేదు. శనివారం రాత్రి హత్య తర్వాత మేము అనేక ప్రాంతాల్లో మరింత బలగాలను మోహరించినప్పటికీ, ఆదివారం హత్యను నిరోధించలేకపోయాము” అని ఆయన చెప్పారు.

జిల్లాలో రెండు రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్‌డిపిఐ నేత కెఎస్‌ షాన్‌ మృతదేహాన్ని ఉంచిన కొచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో పోలీసు బందోబస్తును పటిష్టం చేశారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో పెద్ద సంఖ్యలో ఎస్‌డిపిఐ కార్యకర్తలు మకాం వేశారు.

ఆలప్పుజ శాసనసభ్యుడు, సీపీఎం నాయకుడు పిపి చిత్రరంజన్ మాట్లాడుతూ ఇద్దరు బాధితులు తనకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి హత్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు. శనివారం రాత్రి ఎస్‌డిపిఐ నాయకుడు హత్యకు గురైన అలప్పుజా జిల్లా కేంద్రమైన మన్నాచేరి నుండి పది కి.మీ దూరంలో ఎస్‌డిపిఐ/పిఎఫ్‌ఐకి కంచుకోట.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) రంజీత్ శ్రీనివాస్‌ను హత్య చేసిందని బిజెపి ఆరోపించింది. బీజేపీ నేత హత్యను ఖండిస్తూ, రంజీత్‌ను పట్టపగలు ‘పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు’ నరికి చంపారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మండిపడ్డారు.  గత రెండు నెలల్లో పిఎఫ్‌ఐ ముగ్గురు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను హత్య చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం హంతకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సురేంద్రన్ విమర్శించారు. 
కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్,   ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ‘ఉగ్రవాద శక్తుల’ చేతిలో ఓబిసి నాయకుడి మరణం పట్ల సంతాపం తెలిపారు.   హింసను ‘అనుగ్రహించడం’ వెంటనే ఆపాలని ఈ సంఘటన పినరయి విజయన్ ప్రభుత్వానికి మేల్కొలుపు పిలుపుగా ఉపయోగపడుతుందని హితవు చెప్పారు.  సమూహాలు,  హింసాత్మక సమూహాలకు కేరళ సురక్షితమైన స్వర్గధామంగా మారడానికి ‘అనుమతించడం’ అట్లా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
కేంద్ర మంత్రి వి. మురళీధరన్ రంజీత్ శ్రీనివాసన్ హత్యను ఖండిస్తూ ఇది ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూప్ పని స్పష్టం చేశారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, అలప్పుజాలోని వాయలార్‌కు చెందిన నందు అనే 22 ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను ఎస్‌డిపిఐ వ్యక్తులు హత్య చేశారు. పాలక్కాడ్‌లో సంజిత్ అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త తన భార్యతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా హత్యకు గురయ్యాడు. కేరళలోని ఎలప్పుల్లి ప్రాంతానికి చెందిన సంజిత్‌పై 50కి పైగా కత్తిపోట్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత ప్రాంతంలో అశాంతి నెలకొంది.  
సంఘటనా స్థలం నుండి పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు సాజిత్ హత్య కేసులో ముగ్గురు నిందితులను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు – నెన్మారా నివాసి అబ్దుల్ సలామ్; హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కోజింజంపర నివాసి జాఫర్;  నిందితులు తప్పించుకోవడానికి సహకరించిన ఒట్టపాలెం నివాసి నిసార్. 
నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురితో సహా ఐదుగురు వ్యక్తులు ఇంకా కనుగొనలేదు. పాలక్కాడ్ జిల్లాలోని నెన్మారా, చెర్పులస్సేరి, షోర్నూర్, పుత్తునగరం మరియు అథిక్కోడ్ ప్రాంతంలోని 5 ఎస్‌డిపిఐ/పాపులర్ ఫ్రంట్  కార్యాలయాలపై విచారణ బృందం గురువారం దాడులు చేశారు.