ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీ

డిసెంబర్ 1 వరకు ప్రభుత్వరంగ బ్యాం కుల్లో దాదాపు 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం మంజూరు చేసిన పోస్టులు 8,05,986 ఉంటే, దీనిలో ఇంకా 5 శాతం ఖాళీగా ఉన్నాయని ఆమె చెప్పారు. బ్యాంకుల్లో ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో అత్యధికంగా 8,544 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె వివరించారు. 

ప్రభుత్వరంగ బ్యాం కు(పిఎస్‌బి)ల్లో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉందని, దీని వల్ల పనితీరు దెబ్బతింటుందనే ప్రశ్నకు లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతికూలంగా సమాధానమిచ్చారు. డిసెంబర్ 1 నాటికి మంజూరు చేసిన మొత్తం ఉద్యోగులకు గాను 95 శాతం తీసుకోగా, కొన్ని కారణాల వల్ల ఇంకా స్వల్పంగా మాత్రమే ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. 

ఈ పోస్టుల్లో మూడు విభాగాలకు చెందిన ఆఫీసర్, క్లర్క్, సబ్‌స్టాఫ్ వంటివి ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ ఖాళీలు 12 బ్యాంకుల్లో ఉన్నా యి. ఎస్‌బిఐలో అధికంగా 8,544 పోస్టులు ఖాళీ ఉండగా, ఇక పంజాబ్ నేషనల్ బ్యాం క్‌లో 6,743 పోస్టులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295 పోస్టులు ఖాళీ ఉన్నాయి.

అలాగే ఇం డియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 5,112 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 4,848 పోస్టులు ఖాళీ ఉన్నాయని మంత్రి వివరించారు. ఎస్‌బిఐలో 3,423 ఆఫీసర్ల పోస్టులు, 5,121 క్లర్క్ లెవెల్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి.

కాగా, 2016లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో ఒక పోస్టు మినహా గత ఆరు సంవత్సరాల్లో పిఎస్‌బిల్లో ఏ ఒక్క పోస్టు/ ఖాళీని రద్దు చేయలేదని సీతారామన్ స్పష్టం చేశారు. బ్యాంకులు వారి అవసరాలకు అనుగుణంగా ఖాళీల భర్తీ చేపడుతాయని ఆమె తెలిపారు.