రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తున్నా

దేశ విభ‌జ‌న‌పై కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లకు జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌త‌ప‌ర‌మైన ప్రాతిప‌దిక‌న దేశాన్ని విభ‌జించ‌డం చారిత్ర‌క త‌ప్పిద‌మ‌న్న రాజ్‌నాథ్ వ్యాఖ్య‌ల‌తో తాము ఏకీభ‌విస్తున్నామ‌ని ఫ‌రూక్ అబ్దుల్లా తెలిపారు. 

దేశ విభ‌జ‌న జస‌మ‌యంలో భార‌తీయ ముస్లింలు ఎన్నో ఇబ్బందుల‌కు గురయ్యార‌ని పేర్కొన్నారు. భార‌త్ పాక్ మ‌ధ్య త‌లెత్తే ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల దేశంలో మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతాయ‌ని, భార‌త్‌, పాక్ ఒకే దేశంగా ఉంటే ఇలాంటి ఉద్రిక్త‌త‌ల‌కు ఛాన్సే ఉండేది కాద‌ని ఫ‌రూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

భారతదేశ విభజన చారిత్రాత్మక తప్పిదమని, కాశ్మీరీలే కాకుండా ముస్లిం సమాజం దాని భారాన్ని భరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. విభజన జరగకపోయి ఉంటే ఇరువర్గాలు శాంతియుతంగా సహజీవనం చేయడంతో పాటు దేశం మరింత శక్తివంతంగా ఉండేదని పేర్కొన్నారు. 

కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది చాలా మంచి చర్య. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశానికి ప్రధానమంత్రి అయినందున అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. అనేక మతాలు ఉన్నాయి’ అని చెప్పారు. 

 హిందూ, హిందుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై అబ్దుల్లా స్పందిస్తూ.. ‘మతాలు ఎప్పుడూ చెడ్డవి కావు. మనుషులు’ అని హితవు చెప్పారు. ‘హిందూ కో అస్లీ హిందూ బన్నా చాహియే’ (హిందువు నిజమైన హిందువుగా మారాలి), వారి మతాన్ని అనుసరించాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఆదివారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ మత ప్రాతిపదికన దేశ విభజన ‘చారిత్రక తప్పిదం’ అని పేర్కొన్నారు.