ఏపీలో ఒకేరోజు రెండు ఒమైక్రాన్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కరోజే రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన విజయనగరం వాసికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అవగా, తిరుపతిలో మరో వ్యక్తికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. యూకే నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐకి ఒమైక్రాన్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
34 సంవత్సరాల ఎన్‌ఆర్‌ఐ ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈనెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చారు.  ఈరోజు ఆయనకు జీనమ్ టెస్ట్ చేయగా ఒమైక్రాన్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసు నమోదయినట్లు ఆదివారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏండ్ల వ్యక్తి గత నెలలో ఐర్లాండ్‌ నుంచి విశాఖపట్నం వచ్చాడని, అతనికి పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిందని తెలిపారు. 
విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని వైద్యారోగ్య శాఖ వెల్లడింది. 10 కేసుల్లో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందనక్కర్లేదని వైద్యారోగ్యశాఖ భరోసా ఇచ్చింది. 
 

వీటితో దేశంలో ఒమిక్రాన్‌  కేసులు 36కు చేరాయి. పంజాబ్‌, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదయింది. నవంబర్‌ 22న ఇటలీ నుంచి వచ్చిన 20 ఏండ్ల యువకుడికి ఈ వైరస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. 

డిసెంబర్‌ 1న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. దీంతో అతని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపామని, అందులో ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని పేర్కొన్నారు. అతడు ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడించారు. తాజాగా కరోనా పరీక్ష చేశామని, ఫలితాల కోసం చూస్తున్నామని పేర్కొన్నారు.

దీంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 36కు చేరింది. ఇప్పటికే మహారాష్ట్రలో 17, గుజరాత్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.