పెన్సిల్వేనియా యూనివర్శిటీ అధ్యక్షురాలిగా ఏపీ మహిళ

 ఆంధ్రప్రదేశ్ కు  చెందిన మహిళకు అమెరికాలో అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీకి అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ నీలి బెండపూడి ఎంపికయ్యారు. 

తొలిమహిళగానే కాకుండా శ్వేతజాతీయేతర వ్యక్తి అధ్యక్షురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించినట్లు పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రకటించింది. నీలి బెండపూడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. ఉన్నత విద్య కోసం 1986లో అమెరికా వెళ్లారు. 

పెన్‌ స్టేట్‌ తదుపరి అధ్యక్షురాలిగా డిసెంబర్‌ 9న పెన్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ నీలి బెండపూడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ తన అధికారికి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం కెంటకీలోని లూయిస్‌విల్లే యూనివర్శిటీ అధ్యక్షురాలిగా, మార్కెటింగ్‌ 18వ అధ్యక్షురాలిగా, ప్రొఫెసర్‌గా ఆమె  విధులు నిర్వహిస్తున్నారు. 

30 ఏళ్ల తన కెరీర్‌లో మార్కెటింగ్‌లో మెళకువలను బోధించడంతో పాటు కెన్సాస్‌ యూనివర్శిటీ అధికారిగా, వైస్‌ ఛాన్సలర్‌గా, కెన్సాస్‌ యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌గా, ఒహియో స్టేట్‌ యూనివర్శిటీలో ఇన్షియేటివ్‌ ఫర్‌ మేనేజింగ్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా విభిన్న పదవులు చేపట్టారు. 

తన జీవితాన్ని విద్యార్థుల విజయానికి ఆమె అంకితం చేశారు. ఆమె తన ఉన్నత స్థానాన్ని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది. పెనెస్టేట్‌ 19వ అధ్యక్షురాలిగా 2022లో విధులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా నీలి బెండపూడి మాట్లాడుతూ..”పెన్‌ స్టేట్‌ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం” అని ఆమె తెలిపారు.